క్యాపిటల్ భవనంపై దాడి : ట్రంప్ పాత్ర ఏంతంటే .. సంచలన వ్యాఖ్యలు చేసిన విచారణ కమిటీ

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం 2020 జనవరి 6న యూఎస్ కాంగ్రెస్ క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.

ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.

భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.

వారిని శాంతింపజేసేందుకు భద్రతా దళాలు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.

దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలింది.

గతంలో ఏ అధ్యక్షుడికి రానంత అప్రతిష్టను ట్రంప్ మూట కట్టుకోవాల్సి వచ్చింది.దీనిపై విచారణ నిమిత్తం అమెరికా ప్రతినిధుల సభ స్వతంత్ర కమీషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనకు సంబంధించి నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పాత్రపై ప్యానెల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఏడాది పాటు జరిగిన ద‌ర్యాప్తు వివ‌రాల‌ను హౌజ్ క‌మిటీ గురువారం వెల్ల‌డించింది.క్యాపిట‌ల్ హిల్ వ‌ద్ద‌కు వేలాది మంది జ‌నాన్ని స‌మీకరించింది ట్రంపేనని అభిప్రాయపడింది.

అలాగే తన విద్వేష ప్ర‌సంగంతో ఆయనే అభిమానుల్ని దాడికి ఉసిగొల్పిన‌ట్లు కూడా ప్యానెల్ విచార‌ణ‌లో వెల్ల‌డైంది.

ఈ దాడికి ఆజ్యం పోసింది ట్రంపేనని క‌మిటీ వైస్ చైర్మన్ రిప‌బ్లిక‌న్ నేత లిజ్ చెనాయ్ వ్యాఖ్యానించారు.

క్యాపిట‌ల్ హిల్ అల్ల‌ర్లు అమెరికా ప్ర‌జాస్వామ్యాన్ని ప్ర‌మాదంలో ప‌డేసిన‌ట్లు డెమొక్రాట్ నేత బెన్నీ థాంప్స‌న్ ఆందోళన వ్యక్తం చేశారు.

"""/" / ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు గతంలో ట్రంప్ చేసిన ఆరోప‌ణ‌లు నిరాధార‌మ‌ని అమెరికా అటార్నీ జ‌న‌ర‌ల్ బిల్ బ్రార్ చెప్పిన వీడియోను కూడా క‌మిటీ రిలీజ్ చేసింది.

అలాగే అటార్నీ జ‌న‌ర‌ల్ ఇచ్చిన నివేదిక‌ను ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా ఆమోదించిన‌ట్లు ప్యానెల్ తెలిపింది.

అయితే ప్యానెల్ విచార‌ణ‌ను ఓ రాజ‌కీయ బెదిరింపుగా ట్రంప్ ఆరోపించారు.

వైరల్ వీడియో: ఇదేందయ్యా ఇది.. వెండితో మెరిసిపోతున్న బెడ్ రూమ్