ఇల్లు కూలింది…అవ్వగూడు చెదిరింది..

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చిన్ని హంసవ్వ అనే మహిళా ఇల్లు కూలిపోయింది.

అలాగే గ్రామంలో చిన్ని శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై విద్యుత్ తీగలు తెగి ఇంటిపై పడ్డాయి.

అదృష్టవశత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎంపీటీసీ సౌల్ల లలిత తనయుడు క్రాంతి తెలిపారు.

వెంటనే గ్రామపంచాయతీ సిబ్బంది సహాయంతో విద్యుత్ సరఫరా వైర్ కట్ చేయించమని అన్నారు.

సంఘం స్థలాన్ని ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి పరిశీలించారు.ఇల్లు కూలిపోయిన కుటుంబంను ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అమెరికా రాష్ట్ర సభలు, లోకల్ బాడీల బరిలో ప్రవాస భారతీయులు .. ఎంత మందో తెలుసా?