రామారావు నుండి 'నా పేరు సీసా' సాంగ్.. అన్వేషితో మాస్ రాజా అదిరిపోయే స్టెప్పులు..

మాస్ రాజా రవితేజ స్పీడ్ ఏ విధంగా ఉంటుందో అందరికి తెలుసు.ఎందుకంటే రవితేజ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.

హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.ఇక ఇప్పుడు కూడా ఈయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.

అన్ని కూడా అదే స్పీడ్ తో పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.ప్రెసెంట్ రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.

ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రజిషా విజయన్, దివ్యంసా కౌశిక్ నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, పాటలు, టీజర్ అన్ని కూడా బాగా ఆకట్టు కున్నాయి.

ఇక ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమా నుండి ఇప్పుడు మేకర్స్ మరొక పాటను రిలీజ్ చేసారు.

'నా పేరు సీసా' అనే సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేసారు.

ఈ సాంగ్ ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ తో ఆకట్టు కుంటుంది.ఈ సాంగ్ ఐటెం సాంగ్ అని అర్ధం అవుతుంది.

"""/" / ఈ పాటలోని క్లిన్ బీట్స్ తో పాటు శ్రేయ ఘోషల్ గొంతు ప్రధాన ఆకర్షణ కాగా అన్వేషి జైన్ తో రవితేజ వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి.

ఈమె హాట్ గ్లామర్ షో బాగా ఎలివేట్ అయ్యింది. """/" / ఇది ఇలా ఉండగా ఈ సినిమాను జులై 17న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ భావించారు.

కానీ ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు మేకర్స్.ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం అవ్వడం వల్ల మరోసారి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

ఇక మొత్తానికి ఈ సినిమా అన్ని వాయిదాలు పూర్తి చేసుకుని జులై 29న రిలీజ్ కాబోతుంది.

మరి ఈ సినిమాతో రవితేజ ఎలా ఆకట్టు కుంటాడో చూడాలి.

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!