చంద్రుడిపై ఇల్లా.. నిజమేనా..?

అంతరిక్ష యానం చేయాలని చాలామంది కలలు కంటూ ఉంటారు.ఎంచక్కా ఆకాశంలో చంద్రుడిపై ఇల్లు కట్టుకుని ఒక్కరోజు అయిన అందులో ఉంటే కలిగే కిక్కే వేరు కదా.

కానీ అది అయ్యే పని కాదు అని అనుకుంటున్నారా.చంద్రునిపై ఇల్లు కట్టుకుని ఉండడం అంటే కష్టమైన పని ఏమో కానీ చంద్రుని పై మాత్రం ఒక చిన్న ఇల్లుని కనుగొన్నారు మన చైనాకు చెందిన శాస్త్రవేత్తలు.

చైనాకు చెందిన Yutu-2 రోవర్ చంద్రుని పై ఒక క్యూబ్ షేప్ లో గల ఒక ఇంటిని కనుగొంది.

ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలను చైనా స్పేస్ ఏజెన్సీ గత వారం సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.

చంద్రునిపై గల ఇల్లు వాన్ కర్మన్ క్రాటర్ దాటి వెళ్లే మార్గంలో ఉన్నట్టు Yutu-2 రోవర్ కనుగొంది.

కాగా చైనీస్ చాంగె 4 మిషన్ లో భాగంగా 2019 లో చంద్రుడిపైకి వెళ్లిన ఈ రోవర్ అప్పటి నుంచి చంద్రుడిపై జరిగే వినూత్న అంశాలను సేకరిస్తూ వాటిని బయటపెడుతూ వస్తుంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు రోవర్ వాన్ కర్మన్ క్రాటర్ లోని ఉత్తర కేంద్రంలో ఈ క్యూబిక్ ఆకారంలో ఉన్న ఇంటిని కనిపెట్టినట్లు తెలిసింది' అని ఆండ్రూ జోన్స్ అనే ఒక జర్నలిస్టు రాసుకొచ్చారు.

"""/" / బహుశా చంద్రుడిపై ఉన్న ఇల్లు ఒబెలిస్క్ అయివుంటుందని లేదంటే అది ఏలియన్స్ కు చెందినదై ఉండాలి అని అనుమానం వ్యక్తం చేస్తూనే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అదే ట్వీట్ లో రాసుకొచ్చారు.

ఈ ట్వీట్ పై ఒక ఇంగ్లీష్ మీడియా ఈ విధంగా స్పందించింది.దీని గురించి మరింతగా తెలుసుకోవాలంటే చంద్రుని పై ఉన్న రోవర్ ఆ ఇంటికి మరింత దగ్గరగా డ్రైవ్ చేయాల్సి ఉందని కొందరు సైంటిస్టులు అంటున్నారు.

చంద్రునిపై ఇల్లు అంటే భలే వింతగా ఉంది.అసలు ఆ ఇల్లు ఎలా ఉంటుంది, దానిని ఎవరు నిర్మించారు అనే ప్రశ్నలు నెటిజన్ల మదిలో మెదులుతున్నాయి.

రాజమౌళి ని తక్కువ అంచనా వేసిన నటుడు…కట్ చేస్తే ఆయన టాలెంట్ చూసి సారీ చెప్పాడట…? ఆయనెవరంటే..?