బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించే ఉల‌వ జావ‌..ఎప్పుడు తీసుకోవాలంటే?

బెల్లీ ఫ్యాట్ లేదా పొట్ట చుట్టు కొవ్వు స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామ‌న్‌గా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామం చేయకపోవడం, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, శ‌రీరానికి స‌రిప‌డా నిద్ర లేక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోతుంది.

దాంతో నాజూగ్గా ఉండే పొట్ట కాస్త‌.బాన పొట్ట‌లా త‌యార‌వుతుంది.

అయితే బెల్లీ ఫ్యాట్‌ను స‌హ‌జంగా క‌రిగించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాంటి వాటిలో ఉల‌వ జావ కూడా ఒక‌టి.సాధార‌ణంగా ఉల‌వ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఉల‌వ‌ల్లో ప్రోటీన్లు, ఐర‌న్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్, విట‌మిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

అందుకే ఉల‌వ‌లు ఎన్నో జ‌బ్బుల‌ను కూడా నివారించ‌గ‌ల‌వు.ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు ఉద‌యాన్నే ఒక గ్లాస్ ఉల‌వ జావ తీసుకుంటే క్ర‌మంగా పొట్ట కొవ్వు క‌రిగి పోతుంది.

"""/" / పైగా ఉల‌వ జావ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌నేమి కాదు.

ముందుగా ఒక‌టిన్న‌ర గ్లాస్ వాట‌ర్ తీసుకుని అందులో అర స్పూన్ జీల‌క‌ర్ర పొడి, పావు స్పూన్ అల్లం ర‌సం, చిటికెడు మిరియాల పొడి మ‌రియు కొద్దిగా ఉప్పు వేసి మ‌రిగించాలి.

నీరు బాగా మ‌రిగిన త‌ర్వాత రెండు స్పూన్ల ఉల‌వ పిండి వేసి బాగా తిప్పుతూ జావ‌లా చేసుకుని.

ఉద‌గాన్నే సేవించాలి.ఈ ఉల‌వ జావ ప్ర‌తి రోజు తీసుకుంటే.

త‌ప్ప‌కుండా మీ పొట్ట స‌న్న‌జాజి తీగ‌లా మారుతుంది.అంతేకాదు, ఉల‌వ జావ తీసుకుంటే శ‌రీరంలో ప్రోటీన్ కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

ఎముక‌లు, దంతాలు దృఢంగా మార‌తాయి.ర‌క్త హీన‌త దూరం అవుతుంది.

నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.కాబ‌ట్టి, పొట్ట కొవ్వు ఉన్న వారే కాదు ఎవ్వ‌రైనా ఉల‌వ జావ తీసుకోవ‌చ్చు.

తారక్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. తమ హీరో అంత తప్పేం చేశాడంటూ?