హ్యాపీ వీకెండ్ ఫస్ట్ లుక్ విడుదల
TeluguStop.com
శ్రీ సారిక మూవీస్ పతాకం పై కారాడి వెంకటేశ్వర్లు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో మరో నిర్మాత రాధాకృష్ణతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ' హ్యాపీ వీకెండ్ '.
ఇది ఒక హారర్ కామెడీ చిత్రం.ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని గోవా లో చివరి షెడ్యూల్ కి పయనం అయ్యారు.
వినాయక చవితి సందర్భంగా హ్యాపీ వీకెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ "హ్యాపీ వీకెండ్ చిత్రం ఒక హారర్ కామెడీ చిత్రం.
చింతా పృద్వి చరణ్, చంద్రదిత్య, భాస్కర శర్మ, హర్ష నల్లబెల్లి, యాష్, రూప, కావ్య కీర్తి, గౌతమి లాంటి యూత్ ఫుల్ నటి నటులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము.
కథ కథనం చాలా కొత్తగా ఉంటుంది.మా చిత్రాన్ని యూత్ ప్రేక్షకులను టార్గెట్ చేసి మంచి వినోదం తో హారర్ కామెడీ చిత్రాన్ని నిర్మించాము.
ప్రేక్షకులు మా చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.త్వరలో అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని చిత్రాన్ని విడుదల చేస్తాము" అని తెలిపారు.
H3 Class=subheader-styleచిత్రం పేరు:/h3p హ్యాపీ వీకెండ్
H3 Class=subheader-styleనటీనటులు: /h3pచింతా పృద్వి చరణ్, చంద్రదిత్య, భాస్కర శర్మ, హర్ష నల్లబెల్లి, యాష్, రూప, కావ్య కీర్తి, గౌతమి, తదితరులు.
కెమెరామన్ - రవికుమార్,
ఎడిటింగ్ - K రంగస్వామి, సంగీతం - ప్రజ్వల్ క్రిష్,
పి ఆర్ ఓ - పాల్ పవన్ ,
నిర్మాతలు - కారాడి వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ,
దర్శకుడు - కారాడి వెంకటేశ్వర్లు.