రోజూ తేనె వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి!
TeluguStop.com
సాధారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేవారు ప్రతిరోజు తేనెను వాడుతుంటారు.సహజ సిద్ధంగా లభించిన తేనెలో ఎన్నో పోషకాలు ఉండటం వల్ల మన ఆరోగ్యానికి మంచి కలుగుతుంది.
అయితే సహజసిద్ధంగా తేనే లభించడం కష్టతరం కాబట్టి, మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన తేనెను ఉపయోగిస్తూ ఉంటారు.
మార్కెట్లో లభ్యమయ్యే తేనే నిజంగానే స్వచ్ఛతను కలిగి ఉంటుందా? అని అనుమానాలు కొన్నిసార్లు తలెత్తుతుంటాయి.
ఇలాంటి అనుమానాలను బయటపెట్టేందుకు కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన శాస్త్రీయ పర్యావరణ సంస్థ రంగంలోకి దిగింది.
ఈ సంస్థకు చెందిన చీఫ్ మార్కెట్లో లభ్యమయ్యే పలురకాల తేనెలను పరీక్షలకు పంపారు.
అయితే ఆ తేనె దాదాపు చక్కెర పాకంతో కల్తీ అయినదని తాజా పరిశోధనల్లో వెల్లడయింది.
మనకు మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల కంపెనీలకు చెందిన మొత్తం పదమూడు రకాల బ్రాండ్లకు చెందిన తేనె శాంపిల్స్ ను జపాన్ లో న్యూక్లియర్ మ్యాగ్నెటిక్రిసోనెన్స్ పరీక్షల కోసం పంపారు.
ఈ పరీక్షలలో ఆ తేనె స్వచ్ఛమైనది కాదని, అందులో దాదాపు 50 నుంచి 80 శాతం వరకు చక్కెర పాకంతో తయారు చేసి ఉందని అధికారులు తెలిపారు.
మొత్తం 13 రకాల శాంపిల్స్ ను పరీక్షలకు పంపగా, అందులో పది బ్రాండ్లకు చెందిన తేనె ఫెయిల్ అయిందని కేవలం సఫోలో.
మార్కె ఫెడ్ సోనా.సోసొయేట్ నేచురల్లీవి ఈ బ్రాండ్ లు మాత్రమే సహజంగా తయారు చేయబడిందని తెలిపారు.
"""/" /
ఈ వ్యవహారంపై ప్రముఖ కంపెనీలు రంగంలోకి దిగి.తమ కంపెనీలకు ఉన్న బ్రాండ్ పేరును దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని పెద్దఎత్తున ఆరోపించారు.
ఈ నివేదికలో ఎటువంటి వాస్తవం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కల్తీ లేకుండా కేవలం స్వచ్ఛమైన, నాణ్యమైన తేనెను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామని ఆ సంస్థలు పేర్కొన్నారు.
ఈ ఇయర్ లో మన స్టార్ హీరోలు సూపర్ సక్సెస్ లను అందుకుంటారా..?