ఊహించని స్థాయిలో రెచ్చిపోయిన హనీరోజ్.. గ్లామర్ తో అభిమానులకు షాకిస్తోందిగా!
TeluguStop.com
మలయాళ బ్యూటీ హనీ రోజ్( Honey Rose ) గురించి మనందరికీ తెలిసిందే.
ఈమె బాలయ్య బాబు హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది.
ఈ ఒక్క మూవీతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.మరీ ముఖ్యంగా ఈమె అందానికి యువత ఫిదా అయ్యారు.
కాగా ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక ఈ ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్లినా కూడా భారీగా అభిమానులు అక్కడికి చేరుకుంటూ ఉంటారు.
"""/" /
మరి ముఖ్యంగా వీరసింహారెడ్డి సినిమా( Veera Simha Reddy ) తర్వాత ఈమె ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వెళ్తూ సందడి చేస్తూ ఉంటుంది.
ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే హనీ రోజు తాజాగా నటించిన చిత్రం రేచెల్.
తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహ నిర్మాతగా, సహ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకురాలు ఆనందిని బాలా దర్శకత్వం వహించారు.
యాక్టింగ్ ఫీల్డ్ లో హనీ రోజ్‌కి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ సినిమా ఉపయోగించుకోనుందని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతోంది.
"""/" /
వైలెన్స్, బ్లడ్ షెడ్ తో కూడిన కథగా ఈ చిత్రం ఉంటుందని టీజర్ హింట్ ఇస్తోంది.
అలాగే ఈ సినిమాలో బాబు రాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, చందు సలీంకుమార్, రాధిక రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టిల్, జోజి, దినేష్ ప్రభాకర్, పౌలీ వల్సన్, వందిత మనోహరన్ వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని బాదుషా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాదుషా ఎన్‌ఎమ్, రాజన్ చిరాయిల్, అబ్రిడ్ షైన్ నిర్మించారు.
తమ్ముడా.. ఎదురెళ్లి దూకేయ్.. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!