రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌డం లేదా.. తేనెతో ఇలా చేస్తే స‌రి?

ఆరోగ్యాన్ని కాపాడ‌టంలోనూ, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అందుకే శ‌రీరానికి నిద్ర ఎంతో అవ‌స‌ర‌మ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే నేటి ఆధునిక కాలంలో చాలా మంది నిద్ర లేమి స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.

ముఖ్యంగా రాత్రుళ్లు ఎంత నిద్ర పోదామ‌ని ప్ర‌య‌త్నించినా కొంద‌రికి నిద్ర ప‌ట్ట‌నే ప‌ట్ట‌దు.

దాంతో ఉద‌యానికి తీవ్రంగా అల‌సిపోతుంటారు.ఈ క్ర‌మంలోనే నిద్ర ప‌ట్టేందుకు మందులు వాడుతుంటారు.

అయితే మందులు కాకుండా ఇంట్లోనే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సులువుగా ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.

ముఖ్యంగా నిద్ర లేమిని నివారించ‌డంలో తేనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక‌టి లేదా రెండు స్పూన్ల స్వ‌చ్ఛ‌మైన తేనెను క‌లిపి సేవించాలి.

ఇలా చేస్తే మైండ్‌ మరియు బాడీ రీ ఫ్రెష్ అవుతుంది.దాంతో త్వ‌ర‌గా నిద్ర ప‌డుతుంది.

కాబట్టి, ఎప్పుడైనా ఎవరైనా నిద్రలేమి సమస్య తో సతమతమవుతూ ఉండే వాళ్లు తేనెను తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

"""/" / అలాగే అర‌టి పండు, తేనె కాంబినేష‌న్ తీసుకోవ‌డం ద్వారా కూడా నిద్ర లేమి స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

అవును, రాత్రి ప‌డుకునే ముందు బాగా పండిన అర‌టి పండును తేనెతో క‌లిపి తీసుకోవాలి.

ఇలా చేసినా కూడా నిద్ర బాగా ప‌డుతుంది.మ‌రియు త్వ‌ర‌గా నిద్ర‌లోకి జారుకుంటారు.

ఇక పాలు, తేనె కాంబినేష‌న్ డ్రింక్ తీసుకున్నా కూడా నిద్ర లేమి స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.

ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ తేనె వేసి మిక్స్ చేసి తాగాలి.

ఇలా ప‌డుకునే ముందు చేస్తే త్వ‌ర‌గా నిద్ర పోతారు.మ‌రియు నిద్ర పట్టడం లేదు అన్న సమస్యే రాకుండా ఉంటుంది.

అయితే స్వ‌చ్ఛ‌మైన తేనెను మాత్ర‌మే ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ఈరోజు జరిగే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో గెలిచేది ఏ టీమ్ అంటే..?