తేనెతో ఇలా చేస్తే.. ఎలాంటి దగ్గు, జలుబు అయినా పోవాల్సిందే?
TeluguStop.com
అసలే చలి కాలం.ఈ సీజన్‌లో గాలిలో తేమ పెరగడం.
ప్రతి ఒక్కరి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల బారిన ఎక్కువగా పడుతుంటారు.
అయితే ఇలాంటి వారికి తేనె ఒక ఔషధంలా పని చేస్తుంది.తేనెలో తియ్యదనం మాత్రమే కాదు.
ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి.అవి మన ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో పాటు.
అనేక జబ్బులను నివారిస్తాయి.అలాగే తేనెలో ఉండే యాంటీ బయోటిక్స్ దగ్గు, జలుబు సమస్యలను సులువుగా నివారిస్తాయి.
మరి తేనెను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బంది పడే వారు ఒక స్పూన్ తేనెను.
ఒక స్పూన్ అల్లం రసంతో కలిపి ప్రతి రోజు తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గుతో పాటు గొంతు నొప్పి సమస్య కూడా దూరం అవుతుంది.
లేదా తేనెను మరో విధంగా కూడా ఉపయోగించవచ్చు.ఒక స్పూన్ తేనెకు అర స్పూన్ దాల్చిన పొడి కలిపి ప్రతి రోజు తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల కూడా జలుబు, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తాయి.
ఇక తేనెతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.నిద్రలేమి సమస్యతో బాధ పడేవారికి తేనె గ్రేట్‌గా సహాయపడుతుంది.
ప్రతి రోజు నిద్రేంచే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి సేవించడం వల్ల నిద్ర త్వరగా మరియు ప్రశాంతంగా పడుతుంది.
అలాగే బరువు తగ్గాలని కోరుకునే వారు.ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో తేనె కలిపి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి.బరువు తగ్గేలా చేస్తుంది.
తేనెను ప్రతి రోజు ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
మరియు తేనె చర్మాన్ని కూడా ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.
వైరల్: ఇటువంటి సాహసం మీ వల్ల కానేకాదు సుమీ!