పాదాల పగుళ్లను సులభంగా నివారించే తేనె..ఎలాగంటే?
TeluguStop.com
పాదాల పగుళ్లు.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో వేధించే సర్వ సాధారణ సమస్య ఇది.
ప్రస్తుత వర్షా కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, తేమ సరిగా లేక పోవడం, పాదాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, శరీర వేడి ఇలా రకరకాల కారణాల వల్ల పగుళ్ల సమస్య ఏర్పడుతుంది.
ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే.పాదాలపై చర్మం ఊడి గాయాలుగా మారిపోతాయి.
అందుకే వీటిని తగ్గించుకునేందుకు రకరకాల క్రీములు వాడుతుంటారు. """/" /
అయితే పాదాల పగుళ్లను సులభంగా మరియు సమర్థవంతంగా నివారించడంలో తేనె అద్భుతంగా సహాయపడుతుంది.
మరి తేనెను పాదాలకు ఎలా యూజ్ చేయాలి? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసు కుందాం.
ముందు ఒక టబ్ తీసుకుని అందులో గోరు వెచ్చని నీరు పోయాలి.ఇప్పుడు అందులో ఒక కప్పు స్వచ్ఛమైన తేనె వేసి బాగా మిక్స్ చేసి.
అందులో పాదాలను ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఉంచాలి.ఆ తర్వాత వేళ్లతో పాదాలను మెల్ల మెల్లగా రుద్దు కుంటూ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒక సారి చేస్తే.తేనెలో ఉండే యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పగుళ్లను నివారించి పాదాలను మృదువుగా మారుస్తాయి.
"""/" /
అలాగే ఒక గిన్నె తీసుకుని.అందులో మూడు స్పూన్ల తేనె, రెండు స్పూన్ల బియ్యం పిండి మరియు ఐదారు చుక్కలు వెనిగర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి.సున్నితంగా రుద్దు కోవాలి.
ఆ తర్వాత కాసేపు డ్రై అవ్వనిచ్చి.అప్పుడు గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేసినా కూడా పాదాల పగుళ్లు మటు మాయం అవుతాయి.
మధుమేహం ఉన్నవారు బెండకాయ తింటే ఏం అవుతుందో తెలుసా..?