రైల్వే స్టేషన్‌లో బ్యాగ్ మరిచిపోయిన ఎన్ఆర్ఐ.. గంటల వ్యవధిలో అప్పగించిన పోలీసులు

రోడ్డు మీద పది రూపాయల నోటు కనిపిస్తే ఎవరికీ తెలియకుండా జేబులో పెట్టేసుకునే రోజులివి.

అలాంటిది మనం ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే అది దొరుకుతుందనే ఆశలు వదలుకోవాల్సిందే.పోనీ పోలీసులకు ఫిర్యాదు చేసినా.

వాళ్లు పట్టించుకుంటారని అనుకోవడం అడియాసే.ఒకవేళ దర్యాప్తు జరిపినా అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు.

కానీ ఈకాలంలోనూ కొందరు మనసున్న మనుషులు, నిజాయితీపరులు అక్కడక్కడా కనిపిస్తుంటారు.పరాయి సొమ్ము పాము లాంటిదని భావించి ఏదైనా వస్తువు , డబ్బు దొరికినా పోలీసులకు అప్పగిస్తూ వుంటారు.

పంజాబ్‌లో అచ్చం అలాంటి ఘటనే జరిగింది.అమెరికాకు చెందిన 90 ఏళ్ల ఎన్ఆర్ఐ ములాఖ్ రాజ్ గురువారం అమృత్‌సర్ రైల్వేస్టేషన్‌లో తన హ్యాండ్ బ్యాగ్‌ని మరిచిపోయారు.

అందులో విలువైన వస్తువులు వుండటంతో ఇక జీవితంలో వాటిని తిరిగి చూస్తాననే ఆశను ఆయన వదిలేసుకున్నారు.

అయితే ములాఖ్ రాజ్ బ్యాగ్‌ను రైల్వేస్టేషన్‌లో గుర్తించిన గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) సిబ్బంది.

అమృత్‌సర్‌లోని అతని బంధువుల జాడ తెలుసుకోగలిగారు.ఒక ఆపిల్ ల్యాప్‌టాప్, రెండు మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్, కెమెరా ఇతర వస్తువులతో కూడిన బ్యాగ్‌ను అతనికి తిరిగి అప్పగించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ సురీందర్ కుమార్ మాట్లాడుతూ.పోలీస్ శాఖ ప్రతిష్టను మెరుగుపరచడంలో ఇలాంటి చర్యలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

తాను 120 దేశాలను సందర్శించానని.కానీ ఇలాంటి అద్భుతమైన అనుభవం తనకు ఎప్పుడూ ఎదురుకాలేని ములాఖ్ రాజ్ అన్నారు.

తన బ్యాగ్ పోవడంతో ఎంతో బాధపడ్డానని.తిరిగి జీవితంలో తాను పొందలేనని భావించానని తెలిపారు.

దీనిపై జీఆర్‌పీకి ఫిర్యాదు చేయాలని అనుకున్నానని.కానీ అప్పటికే వారు బ్యాగ్ గుర్తించి దానిని తనకు అప్పగించారని ములాఖ్ రాజ్ పేర్కొన్నారు.

రాణికా బాగ్ ప్రాంతంలోని బంధువులను కలిసేందుకు ములాఖ్ రాజ్ గురువారం ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు వచ్చారని జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు.

వయసు మీదపడ్డ వ్యక్తి కావడంతో రైల్వేస్టేషన్‌లో బ్రీఫ్ కేస్, హ్యాండ్ బ్యాగ్‌ని మరిచిపోయారని .

అలాగే రాణి కా బాగ్‌కు వెళ్లకుండా బస్టాండ్ వైపు దారి తప్పారని ఎస్‌హెచ్‌వో వెల్లడించారు.

అయితే ఫ్లాట్‌ఫాంపై ఒక బ్యాగ్ దొరికిందని సిబ్బంది చెప్పగా.దానిని తెరిచి చూశామని, అందులో విలువైన వస్తువులు కనిపించాయని చెప్పారు.

అందులో వున్న డైరీ ఆధారంగా రాణీ కా బాగ్ ప్రాంతంలోని ములాఖ్ రాజ్ బంధువులను సంప్రదించినట్లు ఎస్‌హెచ్‌వో చెప్పారు.

ఇదే సమయంలో బాధితుడి సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి వుందని.అయితే సాయంత్రం దానిని ఆన్ చేయడంతో బస్టాంట్ వద్ద అతనిని ట్రేస్ చేసి పోలీస్ స్టేషన్‌కు పిలిపించామని.

అనంతరం బ్యాగ్‌ను తిరిగి ఇచ్చినట్లు తెలిపారు.

ఎన్ఆర్ఐలకు టీడీపీ సీట్లను అమ్ముకున్నారు..: కొడాలి నాని