ఈ హోమ్ మేడ్ సోప్ ను వాడితే మీ స్కిన్ సూపర్ వైట్ గా గ్లోయింగ్ గా మారడం ఖాయం!

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల సోప్స్ అందుబాటులో ఉన్నాయి.ప్రతి ఒక్కరూ తమ స్కిన్ కు సూటయ్యే సోప్ ని ఎంచుకొని వాడుతుంటారు.

కొందరు బాగా ఖ‌రీదైన సోప్స్ ను వాడితే.మరికొందరు కొంచెం తక్కువ ధర వి వాడుతుంటారు.

అయితే మార్కెట్ లో ల‌భ్య‌మ‌య్యే సోప్స్ వ‌ల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సోప్ మాత్రం మీ స్కిన్ ను సూపర్ వైట్ గా, గ్లోయింగ్ గా మారుస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సోప్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు సోప్ బేస్ వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్ల తేనె( Honey ) మరియు వన్ టేబుల్ స్పూన్ చార్కోల్ పౌడర్( Charcoal Powder ) ను వేసుకోవాలి.

చివరిగా ఐదు నుంచి ఆరు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్( Tea Tree Essential Oil ) వేసుకుని సోప్ బేస్ మెల్ట్ అయ్యేంతవరకు ఉడికించాలి.

"""/" / ఇలా ఉడికించిన సోప్ బేస్ ను సోప్ మౌల్డ్స్ లోకి నింపుకోవాలి.

మీ దగ్గర సోప్ మౌల్డ్స్ లేకుంటే ఏదైనా మంచి ప్లాస్టిక్ బాక్స్ లోకి వేసుకుని రెండు మూడు గంటల పాటు వదిలేయాలి.

దీంతో మంచి చార్కోల్ సోప్ సిద్ధం అవుతుంది.ఈ హోమ్ మేడ్ సోప్ ను కనుక మీరు రెగ్యులర్ గా వాడితే మీ స్కిన్ సూపర్ వైట్ గా గ్లోయింగ్ గా మారుతుంది.

అలాగే చర్మం పై పేరుకుపోయిన మురికి మృత‌క‌ణాలు తొలగిపోతాయి. """/" / చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా మెరుస్తుంది.

అంతేకాదు ఈ సోప్ ను వాడటం వల్ల మొటిమలు రావడం తగ్గుతాయి.మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా మాయం అవుతాయి.

పైగా ఈ హోమ్ మేడ్ సోప్ ను వినియోగించడం వల్ల స్కిన్ స్మూత్ అండ్ షైనీ గా మెరుస్తుంది.

కాబట్టి చర్మాన్ని అందంగా కాంతివంతంగా మెరిపించుకోవాలని భావించేవారు తప్పకుండా ఇంట్లోనే ఈ చార్కోల్ సోప్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

ఏపీలో ఇక 30 జిల్లాలు ! ప్రతిపాదనలు సిద్ధం