మీ స్కిన్ సహజంగానే వైట్ గా బ్రైట్ గా మెర‌వాలా.. అయితే ఈ హోమ్ మేడ్ సోప్ మీకోస‌మే!

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల సోప్స్ అందుబాటులో ఉన్నాయి.వాటిలో కూడా ఎన్నో ఫ్లేవర్స్ వచ్చాయి.

ఎవరికి నచ్చిన సోప్ ను వారు కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే మీరు వాడే సోప్‌ వల్ల మీ చర్మానికి ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ మేడ్ సోప్‌ మాత్రం సహజంగానే మీ స్కిన్ ను వైట్ గా బ్రైట్ గా మారుస్తుంది.

అదే సమయంలో మరెన్నో బెనిఫిట్స్ ను అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సోప్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు( Saffron ) వేసి మెత్తగా దంచుకోవాలి.

ఇలా దంచిన కుంకుమపువ్వును మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond Oil ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఆ తర్వాత ఒక సోప్ బేస్ ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని సగానికి పైగా వాటర్ పోసుకోవాలి.

వాటర్ బాగా మరిగిన తర్వాత పైన మరొక గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు సోప్ బేస్ ముక్కలు వేసి డబుల్ బాయిలర్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి.

సోప్ బేస్ మెల్ట్ అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమానికి కూడా వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించాలి.

"""/" / ఆపై స్ట‌వ్‌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ బాల్స్ లో లేదా సోప్ మౌల్డ్స్( Soap Molds ) లో వేసి నాలుగు గంటల పాటు వదిలేస్తే మన సోప్ సిద్ధం అయినట్టే.

ఈ సోప్ ను రోజు కనుక వాడితే నీ చర్మం సహజంగానే తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

ముడతలు, చారలు వంటివి ఏమైనా ఉంటే దూరం అవుతాయి.చర్మం స్మూత్ గా, షైనీ గా మారుతుంది.

పైగా ఈ హోమ్ మేడ్ సోప్ ను వాడటం వల్ల ఎల్లప్పుడూ మీ స్కిన్ నుంచి మంచి సువాసన వస్తుంటుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం లక్కీ భాస్కర్లు ఉన్నారా.. ఇలాంటి మోసాలకు పాల్పడ్డారా?