ముఖాన్ని తెల్లగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా.. అయితే మీరీ హోమ్ మేడ్ సీరం ట్రై చేయాల్సిందే!

సాధారణంగా చాలా మందికి తమ ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తూ కనిపించాలని కోరుకుంటారు.

ఈ క్రమంలోనే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్‌ లను కొనుగోలు చేసి వాడుతుంటారు.

అలాగే తరచూ ఫేషియల్, బ్లీచ్ వంటివి చేయించుకుంటూ ఉంటారు.అయితే వీటివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

చర్మ ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అందుకే సహజంగానే ముఖాన్ని తెల్లగా( White Skin ) మార్చుకునేందుకు ప్రయత్నించాలి.

ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం( Homemade Serum ) అందుకు ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ సీరంను వాడితే సహజంగానే మీ ముఖ చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

అదే సమయంలో మరెన్నో బెనిఫిట్స్ సైతం లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా నైట్ నిద్రించే ముందు ఒక బౌల్ లో పది బాదం పప్పులు( Almonds ) వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.

"""/" / మరుసటి రోజు చిన్న కీర దోసకాయ( Cucumber ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు, నానబెట్టుకున్న బాదం తో పాటు రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగును( Fresh Curd ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / తద్వారా మన సీరం సిద్ధమవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ సీరంను అప్లై చేసుకుని పడుకోవాలి.ప్రతిరోజు ఈ మ్యాజికల్ సీరంను అప్లై చేసుకుంటే సహజంగానే చర్మ ఛాయ మెరుగుపడుతుంది.

ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.అదే సమయంలో ముఖంపై మొండి మొటిమలు( Pimples ) ఉంటే తగ్గుముఖం పడతాయి.

మచ్చలు మాయం అవుతాయి.పిగ్మెంటేషన్ నుంచి విముక్తి లభిస్తుంది.

మరియు స్కిన్ స్మూత్ గా షైనీ గా సైతం మెరుస్తుంది.

ప్రజలకు డబ్బులిస్తా కానీ బ్లాక్ మెయిల్ చేసేవాళ్లకు కాదు.. హర్షసాయి సంచలన వ్యాఖ్యలు!