పగిలిన పెదవులకు సహజసిద్దమైన స్క్రబ్స్
TeluguStop.com
పెదవులు పగిలితే ముఖం చిరాకుగా ఉండటమే కాకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది.ప్రతి ఒక్కరు అందమైన పెదాలు కావాలని కోరుకుంటారు.
అయితే అందమైన పెదాల కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.అలాగే మనకు అందుబాటులో ఉండే కొన్ని సహజ సిద్ధమైన పదార్ధాలతో పగిలిన పెదాలను మృదువుగా,అందంగా చేసుకోవచ్చు.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.ఒక స్పూన్ ఉడికించిన ఓట్ మీల్ లో ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలిపి పెదవులపై రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.
5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ లో అరస్పూన్ బ్రౌన్ షుగర్ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.ఒక స్పూన్ పుదీనా పేస్ట్ లో ఒక స్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ కోకో పౌడర్ కలిపి పెదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే వారం రోజుల్లో మంచి ఫలితం కనపడుతుంది.
ఒక స్పూన్ పంచదారలో ఒక స్పూన్ కొబ్బరి నూనె,ఒక స్పూన్ నిమ్మరసం కలిపి పెదాలకు రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి చాలాల్ని నీటితో శుభ్రం చేయాలి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
ఒకే ఏడాదిలో ఏకంగా రెండు సినిమాలు.. స్టార్ హీరో బాలకృష్ణకు మాత్రమే సాధ్యమా?