పాదాల‌ ప‌గుళ్లా..అయితే ఈ స్క్రబ్స్ యూజ్ చేయాల్సిందే!

వింటర్ సీజ‌న్‌లో పాదాలు ప‌గ‌ల‌డం స‌ర్వ సాధార‌ణం.వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల కార‌ణంగా ఈ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

కానీ, కొంద‌రు సీజ‌న్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ పాదాల ప‌గుళ్ల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంటారు.

ఇలా జ‌ర‌గ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.ఆహార‌పు అల‌వాట్లు, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఎక్కువ స‌మ‌యం పాటు నిల‌బ‌డ‌టం, తేమ సరిగా లేకపోవడం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పాదాలు త‌ర‌చూ ప‌గిలిపోతుంటాయి.

దాంతో తీవ్ర‌మైన నొప్పి పుట్ట‌డంతో పాటు న‌డ‌వ‌డానికి కూడా చాలా క‌ష్టంగా ఉంటుంది.

అయితే అలాంట‌ప్పుడు ఇప్పుడు చెప్ప‌బోయే స్క్ర‌బ్స్ యూజ్ చేస్తే.త్వ‌ర‌గా పాదాల ప‌గుళ్ల‌కు బై బై చెప్పొచ్చు.

మ‌రి ఆ స్క్ర‌బ్స్ ఏంటో చూసేయండి.పాదాల ప‌గుళ్ల‌ను నివారించ‌డంలో ఓట్స్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

ఒక బౌల్‌లో ఓట్స్ పొడి మ‌రియు ఆలివ్ ఆయిల్ వేసుకుని.కాస్త బ‌ర‌క‌గా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు పూసి స్క్ర‌బ్ చేసుకుని.గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.

అనంతరం త‌డిలేకుండా పాదాల‌ను ట‌వ‌ల్‌తో తుడిచి.లైట్‌గా కొబ్బ‌రి నూనెను అప్లై చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే పాదాల ప‌గుళ్లు మ‌టుమాయం అవుతాయి. """/"/ అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో షుగ‌ర్, ప‌సుపు, క‌ల‌బంద గుజ్జు మ‌రియు బాదం ఆయిల్‌ వేపి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మంతో పాదాల‌కు స్క్ర‌బ్ చేసి.ఆ త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇప్పుడు పాదాల‌కు తుడుచుకుని.మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

ఇలా చేసినా పాదాల ప‌గుళ్లు త్వ‌ర‌గా పోతాయి.ఇక ఈ టీప్స్‌ను పాటించ‌డంతో పాటు ఎక్కువ స‌మ‌యంలో పాటు నిల‌బ‌డ‌కుండా ఉంటాయి.

త‌ర‌చూ పాదాల‌ను నీళ్లతో తడ‌ప‌టం చేయ‌కూడ‌దు.వాట‌ర్ మాత్ర‌మే కాకుండా పండ్ల రసాలు, మ‌జ్జిగ‌, కొబ్బ‌రి నీరు వంటి తాగాలి.

ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందుకు పాదాల‌కు ఫుట్ క్రీం లేదా మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోవాలి.

రామ్ చరణ్ బుచ్చిబాబు ఈ సినిమాలో కీలకపాత్ర వహిస్తున్న సీనియర్ హీరో…