పెదాలను మృదువుగా మరియు ఎర్రగా మార్చే హోమ్ మేడ్ లిప్ క్రీమ్‌ మీకోసం!

అసలే ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతోంది.ఈ సీజన్ లో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా పెదాలు పొడిబారిపోవడం, పగిలిపోవడం వంటివి జరుగుతుంటాయి.

ఇలా తరచూ జరగడం వల్ల పెదాలు రంగు కూడా తగ్గుతాయి.దాంతో ఏం చేయాలో తెలియక తోచిన చిట్కాలు అన్ని ప్ర‌య‌త్నిస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ లిప్ క్రీమ్ ను క‌నుక వాడితే మీ పెదాలు సహజంగానే మృదువుగా మరియు ఎర్రగా మారుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ మేడ్ లిప్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందు రెండు లేదా మూడు గులాబీ పూలు తీసుకుని వాటికి ఉండే రేకులను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో గులాబీ రేకులు వేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గులాబీ రేకుల పేస్ట్ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.

అనంతరం పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ జ్యూస్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకుంటే మన లిప్ క్రీమ్ సిద్ధం అవుతుంది.

"""/"/ ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజుకు రెండు నుంచి మూడు సార్లు ఈ లిప్ క్రీమ్ ను వాడటం వల్ల పెదాలు మృదువుగా, కోమలంగా త‌యార‌వుతాయి.

డార్క్ లిప్స్ ఎర్రగా మరియు అందంగా మారుతాయి.పెదాలు తరచూ పొడిబారకుండా ఉంటాయి.

పైగా ఈ హోమ్‌ మేడ్ లిప్ క్రీమ్‌ను వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

కాబట్టి ప్రస్తుత వింటర్ సీజన్ లో తప్పకుండా ఈ లిప్ క్రీమ్ ను వాడేందుకు ప్రయత్నించండి.

పెదాలను అందంగా మెరూపించుకోండి.

గట్టిగా క్లాస్ పీకాను.. అప్పటినుంచి రెచ్చిపోయాడు.. స్టార్ హీరో నాని కామెంట్స్ వైరల్!