మృదువైన పాదాల కోసం హోమ్ మెడ్ స్క్రబ్స్

చాలా మంది ముఖానికి ఇచ్చిన ప్రాధాన్యత పాదాలకు ఇవ్వరు.పెద్దగా పట్టించుకోరు.

అయితే కొంత మంది మాత్రం పాదాల సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

అయితే వాటి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.అంతేకాకుండా మన ఇంటిలో సులభంగా దొరికే కొన్ని వస్తువులతో స్క్రబ్స్ తయారుచేసుకొని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.నాలుగు స్పూన్ల కొబ్బరినూనెలో రెండు స్పూన్ల బ్రౌన్ షుగర్,6 చుక్కల పెప్పెర్మింట్ ఎసెన్షియల్ ఆయిల్ ని కలపాలి.

ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసుకొని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

రెండు స్పూన్ల సీ సాల్ట్ లో ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ మింట్ జ్యూస్ కలపాలి.

ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి,అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

"""/"/ ఒక బౌల్ లో రెండు స్పూన్ల ఉడికించిన ఓట్ మీల్, మూడు స్పూన్ల ఆలివ్ ఆయిల్,6 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమంతో పాదాలకు స్క్రబ్బింగ్ చేసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

రెండు టీస్పూన్ల బియ్యంపిండిలో ఒక టీస్పూన్ శనగపిండి, ఒక స్పూన్ పాలు కలపాలి.

ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి 5 నిమిషాల పాటు స్క్రబ్ చేయండి.పావుగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!