రోజు ఈ హోమ్ మేడ్ ఫేస్ వాష్ ను వాడితే మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు!

మచ్చలేని ముఖ చ‌ర్మం కోసం ఆరాట‌ప‌డని వారు ఉండ‌రు.ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్న సరే అందం తగ్గుతుందని భావిస్తారు.

అందుకే ముఖం పై ఎలాంటి మచ్చలు లేకుండా ఉండాలని కోరుకుంటారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఫేస్ వాష్ అద్భుతంగా సహాయపడుతుంది.

రోజు ఈ ఫేస్ వాష్ ను వాడితే మీ ముఖం పై ఒక్క మచ్చ కూడా ఉండదు.

పైగా మరెన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ మేడ్ ఫేస్ వాష్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు( Red Lentils ) పిండి వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( Rice Flour ), వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ), హాఫ్ టేబుల్ స్పూన్ హల్ది పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ పీల్ పౌడర్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పౌడర్ ను ఒక డబ్బాలో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ పౌడర్ తోనే రోజు ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఈ పౌడర్ ను రోజుకు వన్ టేబుల్ స్పూన్ చొప్పున అర చేతిలోకి తీసుకుని వాటర్ తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.

రెండు నిమిషాల పాటు చ‌ర్మాన్ని బాగా రుద్దుకుని ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఈ హోమ్ మేడ్ ఫేస్ వాష్ పౌడర్ ను రోజుకు ఒకసారి కనుక వాడితే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.

మచ్చలేని ముఖ చర్మం మీ సొంతం అవుతుంది. """/" / అలాగే ఈ ఫేస్ వాష్ పౌడర్ ని యూస్ చేయడం వల్ల చర్మం పై పేరుకుపోయిన డస్ట్, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మంపై అధిక జిడ్డు తొలగిపోతుంది.

ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి లభిస్తుంది.ముఖ చర్మం సహజంగానే అందంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

కాబట్టి మచ్చలేని మెరిసే ముఖ చర్మం కోసం తప్పకుండా ఈ హోమ్ మేడ్ ఫేస్ వాష్ పౌడర్ ను తయారు చేసుకుని వాడండి.

వీడియో వీడియో: కింగ్‌ కోబ్రా పుట్టుకను చూసారా ఎప్పుడైనా?