రోజూ నైట్ ఈ హోమ్ మేడ్ చందన్ సీరంను వాడితే వద్దన్నా మీ స్కిన్ టోన్ డబుల్ అవుతుంది!
TeluguStop.com
చాలా మంది స్కిన్ టోన్ ను పెంచుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అలాగే తరచూ బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి ఫేషియల్, బ్లీచ్ చేయించుకుంటున్నారు.
ఈ మధ్య పర్మినెంట్ బాడీ వైట్నింగ్ ట్రీట్మెంట్లు కూడా వచ్చాయి.వాటికోసం లక్షలు ఖర్చు పెడుతున్న వారు కూడా ఎందరో ఉన్నారు.
కానీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మృదువుగా మెరిపించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ చందన్ సీరం( Chandan Serum ) అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? దీనివల్ల లభించే ప్రయోజనాలు ఏంటి.
? అన్నది తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో చిటికెడు కుంకుమ పువ్వు, ఆరేడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసి బాగా కలిపి గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ను వేసుకోవాలి.
ఈ జెల్ లో పావు టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood ), చిటికెడు వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆపై కుంకుమపువ్వు నానబెట్టుకున్న రోజ్ వాటర్ ను వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు ఆగకుండా బాగా మిక్స్ చేయాలి.
తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది. """/" /
ఈ హోమ్ మేడ్ చందన్ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న సీరం ను ముఖానికి మెడకు అప్లై చేసుకుని పడుకోవాలి.
ఇలా ప్రతిరోజు కనుక చేస్తే మీ స్కిన్ టోన్ వద్దన్నా కూడా డబుల్ అవుతుంది.
చర్మం కొద్ది రోజుల్లోనే తెల్లగా మృదువుగా కాంతివంతంగా మారుతుంది.చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే మాయం అవుతాయి.
పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేయడానికి కూడా ఈ సీరం గ్రేట్ గా సహాయపడుతుంది.
మరియు ఈ సీరం మీకు ఫేషియల్ గ్లో ను అందిస్తుంది.కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.
బరువు తగ్గడానికి డైలీ గ్రీన్ టీ తాగుతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!