ఆ అమెరికన్ సాహసం వెలకట్టలేనిది..మూగ జీవాలపై ఇంత ప్రేమా..!!
TeluguStop.com
మనుషులకు మూగజీవాలకు మధ్య ఎన్నో ఏళ్ళుగా అనుభందం ఏర్పడింది.వివిధ రకాల అవసరాలకు వాడుకోవడమే కాదు, ఇంట్లో సొంత వ్యక్తులుగా వాటిని పెంచుకుంటూ వాటిపై ప్రేమా ఆప్యాయతలు కురిపిస్తూ ఉంటారు.
ఇళ్ళలో పెంచుకునే వాటి సంగతి సరే మరి రోడ్డుమీద అనాధలుగా తిరగే వాటికైతే ఒక్కోసారి తిండే దొరకదు.
అలాంటి అనాధ మొగజీవాలకు ఆశ్రయమిస్తూ ఓ వ్యక్తి అమెరికాలోని అట్లాంటాలో హోమ్ నడుపుతున్నాడు.
అట్లాంటాలో ఉన్న ఈ హోమ్ ఎంతో ఫేమస్ కూడా నిన్నటి రోజున ఈ హోమ్ కు నిప్పు అంటుకుంది.
అయితే యానిమల్ షెల్టర్ కావడంతో ఆ మూగజీవాల వ్యధ పట్టించుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.
అయితే స్థానికంగా ఉండే కీత్ వాకర్ ఒక్క సారిగా ఈ ఘటన చూసి చలించిపోయాడు.
మంటలు ఎగసి పడుతున్నా సరే లెక్క చేయకుండా ఒకేసారి షెల్టర్ లోకి వెళ్ళిపోయాడు.
షెల్టర్ లో ఉన్న కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులను కాపాడి బయటకి తీసుకువచ్చాడు.
చుట్టుపక్కలవారు వారిస్తున్నా సరే అతడు ఎంతో సాహసం చేశాడని ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పారు.
కీత్ వాకర్ కి చిన్న చిన్న గాయాలు అయ్యాయి.ఇదిలాఉంటే """/"/
ఈ విషయం తెలుసుకున్న స్థానిక మీడియా కీత్ వాకర్ ని పరామర్శించి అక్కడ జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్నారు.
ప్రాణాలకు తెగించి మరీ ఎందుకు అంతగా వాటిని కాపాడారని మీడియా ప్రశ్నించింది.అందుకు అతడు చెప్పిన సమాధానం అందరిని కదిలించింది.
అవి అనాధ జంతువులు, వాటి రోదన నాకు ఆందోళన కలిగించింది.మంటల్లోకి వెళ్ళే ముందు వాటిని కాపాడాలనే లక్ష్యం మాత్రమే నా ముందు ఉంది నా గురించి నేను ఆలోచన చేయలేదు ఎందుకంటె నేను కూడా ఓ అనాదనే అంటూ భావోద్వేగానికి లోనయ్యాడట.
ఎంత లావుగా ఉన్నవారైనా రోజు ఈ డ్రింక్ తాగితే మల్లె తీగల మారతారు!