చిట్లిన జుట్టును పదేపదే కత్తిరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

జుట్టు చిట్లి పోవడం.( Split Hair ) అమ్మాయిల్లో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఒకటి.

అయితే చిట్లిన జుట్టును ఎక్కువ శాతం మంది కత్తిరిస్తూ ఉంటారు.కానీ కత్తిరించిన ప్రతిసారి జుట్టు మళ్ళీ మళ్ళీ చిట్లిపోతూనే ఉంటుంది.

కాబట్టి చిట్లిన జుట్టును కత్తిరించడం పరిష్కారం కానే కాదు.చిట్లిన జుట్టును రిపేర్ చేసుకోవాలి.

అందుకు కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటించారంటే పైసా ఖర్చు లేకుండా చిట్లిన జుట్టును సులభంగా రిపేర్ చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకును( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త మరిగిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) మరియు కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసి ఉడికించాలి.

దాదాపు 15 నిమిషాల పాటు ఉడికిస్తే వాటర్ జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ జెల్ ను ఆరబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం,( Castor Oil ) వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి. """/" / వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.

కలబంద, అవిసె గింజలు, ఆముదం, కొబ్బరి నూనె.చిట్లిన జుట్టును రిపేర్ చేయడానికి అద్భుతంగా తోడ్పడతాయి.

అలాగే ఈ రెమెడీని పాటించడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.ప్రధానంగా వేడి నీటితో తల స్నానం చేసే అలవాటును మానుకోవాలి.

తడి జుట్టును పొరపాటున కూడా దువ్వకూడదు.వారానికి రెండు సార్లు కచ్చితంగా హెయిర్ కి ఆయిల్ ను అప్లై చేసుకోవాలి.

పోషకాహారాన్ని తీసుకోవాలి.మరియు బయటకు వెళ్లేటప్పుడు దుమ్ము, ధూళీ, ఎండ త‌గ‌ల‌కుండా హెయిర్ ను కవర్ చేసుకోవాలి.

విదేశాల్లో భారతీయ విద్యార్ధుల మరణాలు.. ఐదేళ్లలో అంతమందా..?