వింటర్ లో పొడి జుట్టుతో వర్రీ వద్దు.. ఈ రెమెడీని పాటించండి!

సాధారణంగా వింటర్ సీజన్ లో చర్మం తో పాటు జుట్టు సైతం తరచూ పొడి పొడిగా మారుతుంటుంది.

ఇలా జుట్టు త‌ర‌చూ డ్రై అవ్వడం వల్ల నిర్జీవంగా కనిపిస్తుంది.ఈ క్రమంలోనే డ్రై హెయిర్ ను వదిలించుకోవడం కోసం ఖరీదైన కండిషనర్ వాడుతుంటారు.

అయితే సహజంగా కూడా డ్రై హెయిర్ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బాక్స్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె, నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పెరుగు తేనె మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో గంట పాటు పెట్టుకోవాలి.

ఈ లోపు ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కల‌ను మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ అరటి పండు పేస్ట్ లో తేనె పెరుగు మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి.

చివరిగా రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.

"""/"/ ఈ రెమెడీని పాటిస్తే కనుక ఎటువంటి కండిషనర్ అవసరం లేదు.సహజంగానే డ్రై హెయిర్ సమస్య దూరం అవుతుంది.

కురులు సూపర్ షైనీ గా మరియు స్మూత్ గా మారతాయి.మరియు ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.

దాంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.కాబట్టి ప్రస్తుత వింటర్ సీజన్ లో తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ ను వారంలో కనీసం రెండు సార్లు అయినా వేసుకునేందుకు ప్రయత్నించండి.

హనుమంతుని ఆలయానికి లక్షల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం.. ఎక్కడంటే?