ఎలాంటి క్రీములు అక్కర్లేదు.. ఈ రెమెడీని పాటిస్తే ముఖంపై మచ్చల‌న్నీ మాయం అవ్వాల్సిందే!

సాధారణంగా కొందరికి ముఖం చాలా తెల్లగా, మృదువుగా ఉంటుంది.కానీ అక్కడక్కడ ముదురు రంగులో మచ్చలు( Spots ) ఉంటాయి.

ఈ మచ్చల వల్ల ముఖం ఏ మాత్రం అట్రాక్టివ్ గా కనిపించదు.ఈ క్రమంలోనే మచ్చలను వదిలించుకోవడం కోసం ఖరీదైన క్రీమ్ లను కొనుగోలు చేసి వాడుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా మరియు వేగంగా మచ్చలు మాయం చేసుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ హోమ్ రెమెడీ ఏంటి అనేది తెలుసుకుందాం ప‌దండి. """/" / ముందుగా ఒక జాజికాయను తీసుకొని తరుముకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ జాజికాయ పొడి( Nutmeg Powder ), వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( Rice Flour ), పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.

చివరిగా సరిపడా పచ్చి పాలు ( Milk )పోసి అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే ముఖ చర్మంపై ( Facial Skin )ఎలాంటి మచ్చలు ఉన్నా సరే మాయం అవుతాయి.

ఆఖరికి పిగ్మెంటేషన్ మార్క్స్ ఉన్న కూడా క్రమంగా దూరం అవుతాయి.మచ్చలేని మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

"""/" / అలాగే ఈ హోమ్ రెమెడీని పాటించడం వల్ల మొటిమలు రావడం కంట్రోల్ అవుతాయి.

చర్మంపై మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి.స్కిన్ హెల్తీగా, బ్రైట్ గా మెరుస్తుంది.

కాబట్టి మచ్చల సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజ‌ల్ట్ మీ సొంతం అవుతుంది.

మాస్ జాతర గ్లింప్స్ తో రవితేజ ఈజ్ బ్యాక్ అనాల్సిందేనా..?ఒకప్పటి రవితేజ గుర్తుకు వచ్చాడా..?