శనగపిండిలో ఇవి కలిపి ముఖానికి రాస్తే.. మెరిసే చర్మం మీసొంతం!
TeluguStop.com
ముఖం అందంగా, కాంతివంతంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.మార్కెట్‌లో దొరికే అనేక క్రీములు వాడుతుంటారు.
అయినప్పటికీ ఎప్పుడూ ఏదో ఒక చర్మ సమస్యతో బాధపడుతుంటారు.అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే శనగపిండి ఎలాంటి చర్మ సమస్యలనైనా సులువుగా నివారించగలదు.
మరి శనగపిండిని ముఖానికి ఎలా ఉపయోగించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా శనగపిండిలో కొద్దిగా పసుపు మరియు పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.పావు గంట తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గడంతో పాటు చర్మ కాంతి పెరుగుతుంది.
"""/"/
శనగపిండిలో కొద్దిగా రోజ్‌వాటర్, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ముఖాన్ని ముందుగా చల్లటి నీటితో క్లీన్ చేసుకుని.
అనంతరం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అప్లై చేయాలి.పది నిమిషాల పాటు ఆరనిచ్చి.
ఆ తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల అదనపు ఆయిల్‌ను పీల్చుకుని.
ముఖం ఫ్రెష్‌గా మారుతుంది.శనగపిండిలో కొద్దిగా కాఫీ పౌడర్, కలబంద గుజ్జు వేసి బాగా చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.అర గంట తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారినికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల ముడతలు తగ్గి.
చర్మం మృదువుగా, యవ్వనంగా మారుతుంది.మరియు ఈ ప్యాక్ వల్ల మృత కణాలు పోయి.
మూవీ కోసం గుండు గీయించుకున్న సుకుమార్ కూతురు.. కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!