చేతులపై మెహందీ త్వరగా పోవాలా? అయితే ఈ టిప్స్ మీకే!
TeluguStop.com
మెహందీ అంటే మగువలు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పెళ్లైనా, పండగైనా లేదా ఏదైనా ఇతర ఫంక్షనైనా ఆడవారి చేతుల నిండా మెహందీ ఉండాల్సిందే.
మెహందీ పెట్టుకోవడం వల్ల చేతులకు కొత్త కళ వచ్చేస్తుంది.అయితే మెహందీ పెట్టుకున్నాక మొదటి మూడు లేదా నాలుగు రోజులు బాగానే ఉంటుంది.
ఆ తర్వాత కొంచెం కొంచెంగా పోతూ చికాకు పుట్టిస్తుంది.దాంతో మెహందీని పూర్తిగా తొలిగించుకునేందుకు ఏం చేయాలో తెలియక తెగ సతమతమవుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్‌ను పాటిస్తే చాలా సులభంగా చేతులపై మెహందీని పోగొట్టుకోవచ్చు.
మరి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల వైట్ టూత్ పేస్ట్, రెండు స్పూన్ల బంగాళదుంప రసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి బాగా రుద్దుకోవాలి.ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా రెండు, మూడు రోజుల పాటు చేస్తే మెహందీ పూర్తిగా పోతుంది.మరియు మీ చేతులు వైట్‌గా, బ్రైట్‌గా మారతాయి.
"""/"/
అలాగే బేకింగ్ సోడాతోనూ మెహందీను తొలిగించుకో వచ్చు.అందు కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు స్పూన్ల బేకింగ్ సోడా మరియు నాలుగు స్పూన్ల నిమ్మ రసం వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు పూసి కాసేపు స్క్రబ్ చేసుకోవాలి.అనంరతం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేసినా కూడా మెహందీ పూర్తిగా పోతుంది,
ఇక ఆలివ్ ఆయిల్‌తోనూ మెహందీని పోగొట్టుకోవచ్చు.
ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల ఆలివ్ ఆయిల్, రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని చేతులకు పూసి కాసేపు బాగా రుద్దు కోవాలి.అనంతరం వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
రెండు, మూడు రోజులు ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?