యూరిన్ స్మెల్ రావ‌డానికి కార‌ణాలు ఏంటీ..? అస‌లు నివార‌ణ ఎలా..?

యూరిన్ స్మెల్ రావ‌డానికి కార‌ణాలు ఏంటీ? అస‌లు నివార‌ణ ఎలా?

మూత్ర విసర్జన స‌మ‌యంలో భ‌రించ‌లేనంత దుర్వాసన రావ‌డం.చాలా మంది కామ‌న్‌గా ఫేస్ చేసే మూత్ర సమస్యల్లో ఇదీ ఒక‌టి.

యూరిన్ స్మెల్ రావ‌డానికి కార‌ణాలు ఏంటీ? అస‌లు నివార‌ణ ఎలా?

దీని వ‌ల్ల చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు.ఈ స‌మ‌స్య గురించి ఎవ‌రికీ చెప్పుకో లేక‌, ఎలా నివారించుకోవాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.

యూరిన్ స్మెల్ రావ‌డానికి కార‌ణాలు ఏంటీ? అస‌లు నివార‌ణ ఎలా?

అయితే యూరిన్ స్మెల్ రావ‌డానికి కార‌ణాలు అనేకం.యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏర్ప‌డ‌టం, మ‌ధుమేహం, ఆహార‌పు అల‌వాట్లు, శరీరానికి స‌రిప‌డా నీటిని అందించ‌క‌పోవ‌డం, కిడ్నీల్లో రాళ్లు, లివ‌ర్ వ్యాధులు, లైంగిక సంక్రమణ వ్యాధులు, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, యురిన్‌ను ఎక్కువ స‌మ‌యం పాటు ఆపుకోవ‌డం ఇలా ఎన్నెన్నో కార‌ణాల వ‌ల్ల యూరిన్ స్మెల్ వ‌స్తూ ఉంటుంది.

అయితే కార‌ణాలే కాదు.ఈ స‌మ‌స్య‌కు నివార‌ణ మార్గులు కూడా చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాల ద్వారా ఈ స‌మ‌స్య‌ను సుల‌భంగా నివారించుకోవ‌చ్చు.మ‌రి ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యూత్ర దుర్వాస‌న‌ను త‌గ్గించ‌డంలో మ‌జ్జిగ సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది.అవును, రోజుకు రెండు సార్లు గ్లాస్ మ‌జ్జిగ‌లో ఒక స్పూన్‌ ఉల్లిపాయ పేస్ట్ క‌లిపి సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.

"""/" / అలాగే క్రాన్ బెర్రీ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయ‌డ‌మే కాదు.

యూరిన్ స్మెల్ రాకుండా కూడా నిరోధిస్తాయి.అందు వ‌ల్ల‌, క్రాన్ బెర్రీ పండ్ల‌ను తీసుకోవ‌డం లేదా వాటితో త‌యారు చేసిన జ్యూస్‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం చేయాలి.

లెమ‌న్ అండ్ హ‌నీ వాట‌ర్ సైతం ఈ స‌మ‌స్య‌కు అద్భుత‌మైన ప‌రిష్కారంగా చెప్పుకోవ‌చ్చు.

రోజు ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో లెమ‌న్ జ్యూస్‌, హ‌నీ మిక్స్ చేసి సేవిస్తే.

యూరినరీ ట్రాక్ట్ లో ఏర్ప‌డిన బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నాశ‌నం అవుతాయి.

దాంతో యూరిన్ దుర్వాస‌న రాకుండా ఉంటుంది.ఇక వీటితో పాటు వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.

సిట్ర‌స్ ఫ్రూట్స్‌, ప‌సుపు, ఆలివ్ ఆయిల్, హెర్బల్ టీలు, పార్స్‌లీ జ్యూస్ వంటివి తీసుకోవ‌డం ద్వారా కూడా ఈ స‌మ‌స్య‌ను త్వ‌ర‌గా నివారించుకోవ‌చ్చు.