కళ్ల కింద ముడతలా.. ఈ చిట్కాల‌తో చెక్ పెట్టేయండి!

సాధార‌ణంగా వ‌య‌సు పైబ‌డే కొద్ది క‌ళ్ల కింద ముడ‌త‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి.కొంద‌రిలో మాత్రం చిన్న వ‌య‌సులోనే ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంటుంది.

ఆహార‌పు అల‌వాట్లు, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, అధిక ఒత్తిడి, పోష‌కాల లోపం, హార్మోన్ల మార్పులు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌ళ్ల కింద ముడ‌త‌లు ఏర్ప‌డ‌తాయి.

అయితే వీటిని త‌గ్గించుకునేందుకు.ఏవేవో క్రీములు, లోష‌న్లు, ఆయిల్స్ రాస్తుంటారు.

కానీ, న్యాచుర‌ల్‌గానే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.మ‌రి అదెలాగో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

క‌ళ్ల కింద ముడ‌త‌ల‌ను మ‌టుమాయం చేయ‌డంలో గ్రేప్స్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ముందుగా కొన్ని గ్రేప్స్ తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి అందులో తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల కింద వేళ్ల‌తో అప్లై చేసి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో మెల్ల‌గా వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే క్ర‌మంగా క‌ళ్ల కింద ముడ‌త‌లు త‌గ్గుతాయి.

అలాగే ట‌మాటా కూడా క‌ళ్ల కింద ముడ‌త‌ల‌ను వ‌దిలించ‌గ‌ల‌దు.ముందుగా ట‌మాటా పేస్ట్ చేసుకుని.

అందులో నిమ్మ ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల కింద అప్లై చేసి రెండు నిమిషాల పాటు వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా మ‌ర్ద‌న చేసుకోవాలి.

డ్రై అయిన త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

"""/"/ ఇక ఒక బౌల్‌లో కొబ్బ‌రి నూనె మ‌రియు ప‌సుపు వేసి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మానికి క‌ళ్ల కింద పూత‌లా వేసుకుని.పావు గంట లేదా అర గంట పాటు డ్రై అవ్వనివ్వాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేసినా ముడ‌త‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

‌.