మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్యను నివారించే ఎఫెక్టివ్ టిప్స్ ఇవే!
TeluguStop.com
వైట్ డిశ్చార్జ్.దీనినే లుకొరియా అని అంటారు.
చాలా మంది మహిళలను వేధించే సమస్యల్లో ఇది ఒకటి.గర్భకోశంలో గానీ.
జననాంగాల్లో గానీ ఇన్‌ఫెక్షన్ ఏర్పడటం, పలు రకాల మందుల వాడకం, అపరిశుభ్రత, ఆహారపు అలవాట్లు, హార్మోన్ ఛేంజెస్ ఇలా రకరకాల కారణాల వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది.
దాంతో ఈ సమస్యను ఎలా నివారించుకోవాలో అర్థం అవ్వక తెగ సతమతమైపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ టిప్స్‌ను పాటిస్తే గనుక చాలా సులభంగా ఈ సమస్యను నివారించుకోవచ్చు.
మరి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.ముందు ఉసిరి గింజల పొడి వైట్ డిశ్చార్జ్ సమస్యను నివారించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో అర స్పూన్ ఉసిరి గింజల పొడి, అర స్పూన్ బెల్లం వేసి బాగా కలిపి సేవించాలి.
ఇలా కొద్ది రోజులు తీసుకుంటే.వైట్ డిశ్చార్జ్ నుంచి విముక్తి లభిస్తుంది.
అయితే ఉసిరి విత్తనాల పొడి మార్కెట్‌లో లభిస్తుంది.లేదా ఇంట్లో తయారు చేసుకున్నది అయినా వాడొచ్చు.
"""/" /
అలాగే జామ ఆకులు సైతం ఈ సమస్యను దూరం చేయగలవు.
మూడు లేదా నాలుగు లేత జామ ఆకులను తీసుకుని నీటిలో శుభ్రంగా కడగాలి.
ఇప్పుడు ఈ ఆకులను లైట్‌గా దంచి ఒక గ్లాస్ వాటర్‌లో వేసి మరిగించి.
ఫిల్టర్ చేసుకోవాలి.ఆపై ఆ నీటిని గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకోవాలి.
ప్రతి రోజూ ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.ఇక అత్తి పండ్లతోనూ వైట్ డిశ్చార్జ్ సమస్యను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు.
రెండు లేదా మూడు ఎండిన అత్తి పండ్లను నీటిలో రాత్రంతా నాన బెట్టుకుని.
ఉదయాన్నే మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే ఆ సమస్య పరార్ అవుతుంది.
అల్జీమర్స్ అంటే ఏంటి.. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి..?