కళ్ల నుంచి తరచూ నీళ్లు కారుతున్నాయా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
TeluguStop.com

కళ్ల నుంచి నీళ్లు కారడం.చాలా మంది ఇబ్బంది పెట్టే సమస్య ఇది.


ముఖ్యంగా కంప్యూటర్ల ముందు గంటలు తరబడి కూర్చుని పని చేసే వారు తరచూ ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు.


ఇన్ఫెక్షన్, అలర్జీ, స్ట్రెస్, కండ్లకలక, కంట్లో దుమ్ము ధూళి ఉండటం వంటి రకరకాల కారణాల వల్ల కళ్ల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి.
కారణం ఏదైనా ఇప్పుడు చెప్పబోయే టిప్స్‌ను పాటిస్తే గనుక చాలా అంటే చాలా సులభంగా ఈ సమస్యను నివారించుకోవచ్చు.
మరి లేట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.కళ్ల నుంచి నీళ్లు కారడాన్ని ఆపేందుకు ఎగ్ వైట్ అద్భుతంగా సహాయ పడుతుంది.
ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్లపై అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు రెస్ట్ తీసుకోవాలి.
అనంతరం కూల్ వాటర్‌తో కళ్లను క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే ఒక బంగాళదుంప తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను వేరి చేసి.ఐస్ ట్రేలో నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.
"""/" /
నాలుగైదు గంటల అనంతరం ఆ ఐస్ క్యూబ్స్‌ను తీసుకుని.కళ్లపై స్మూత్‌గా మర్దనా చేసుకోవాలి.
ఇలా చేస్తే కళ్ల నుంచి నీళ్లు కారడం తగ్గుతాయి.అదే సమయంలో కళ్ల మంటల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
ఇక ఈ టిప్స్‌తో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.అవేంటంటే.
ల్యాప్ టాప్ ముందు పని చేసేటప్పుడు గ్లాసెస్ వాడాలి.స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం తగ్గించాలి.
కంటి నిండా నిద్ర పోవాలి.వాటర్‌తో పాటు ఫ్రూట్ జ్యూసులు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలి.
మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలి.మరియు కళ్లను రోజుకు రెండు, మూడు సార్లు చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్.. పుట్టినరోజున ఆ సినిమా రిలీజ్ కానుందా?