యూరినరీ ఇన్ఫెక్షన్‌తో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకే!

యూరినరీ ఇన్ఫెక్షన్.చాలా మందిని వేధించే కామ‌న్ స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

ముఖ్యంగా మ‌హిళ‌ల్లో యూరిన‌రీ ఇన్షెక్ష‌న్ స‌మ‌స్య ఎక్కువగా ఉంటుంది.యూరిన్ వెళ్లే మార్గంలో రాళ్లు, ఇతరాత్ర అడ్డంకుల వల్ల ఇన్ఫెక్షన్లు ఏర్పడుతుంది.

యూరిన్ ఇన్పెక్షన్ వ‌ల్ల మూత్రంలో మంట, నొప్పి, బ్యాక్ పెయిన్‌ మరియు జ్వరం లక్షణాలు తెగ ఇబ్బంది ప‌డ‌తాయి.

దీంతో యూరిన‌రీ ఇన్ఫెక్ష‌న్ త‌గ్గ‌డానికి ముందులు వాడ‌తారు.అయితే కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ ద్వారా కూడా యూరిన‌రీ ఇన్ఫెక్ష‌న్ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.యూరినరీ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో సొరకాయ జ్యూస్ ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ.

ప్రతిరోజు ఒక గ్లాసు సొరకాయ రసంలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే.

అందులో ఉండే మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు యూరినరీ ఇన్ఫెక్ష‌న్ స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

డీహైడ్రేషన్ కూడా యూరినీ ఇన్ఫెక్ష‌న్ ఒక ప్ర‌ధాన కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.కాబ‌ట్టి, ప్ర‌తి రోజు మూడు నుంచి నాలుగు లీట‌ర్ల వాట‌ర్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేటెడ్‌గా ఉండ‌డంతో యూరిన‌రీ ఇన్ఫెక్ష‌న్ కూడా దూరం అవుతుంది.

"""/" / యూరినరీ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించ‌డంతో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్క‌లంగా ఉంటే వెల్లుల్లి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, ఉద‌యాన్నే తేనెలో వెల్లుల్లి క‌లిపి తీసుకుంటే.యూరిన‌రీ ఇన్ఫెక్ష‌న్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

అలాగే పార్ల్సే జ్యూస్ కూడా యూరిన‌రీ ఇన్ఫెక్ష‌న్‌ను త‌గ్గించ‌డంతో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది. """/" / ఎందుకంటే, అందులో ఉండే న్యూట్రీషియన్స్, మిన‌ర‌ల్స్‌ మూత్ర మార్గము పనితీరును మెరుగుప‌రిచి ఇన్ఫెక్ష‌న్‌ను నివారిస్తుంది.

ఇక ఇప్పుడు చెప్పుకున్న చిట్కాల‌తో పాటు శుభ్ర‌త కూడా చాలా ముఖ్యం.ఎల్ల‌ప్పుడూ జననేంద్రియ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంమే.

ఎప్పుడూ కూడా యూరిన్‌ను ఆపుకోకూడ‌దు.

కెనడాలో రెచ్చిపోయిన దుండగులు.. హిందూ ఆలయంపై చెత్త రాతలు, భారత్ ఆగ్రహం