టాన్సిల్స్ స‌మ‌స్య‌ను ఈజీగా నివారించే బెస్ట్ చిట్కాలు ఇవే!

టాన్సిల్స్‌.చ‌లి కాలం వ‌చ్చిందంటే చాలు పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు.

మనం తినే ఆహారంలో, తాగే నీళ్లలో, పీల్చే గాలిలో ఉండే.కాలుష్యాలు, విషపదార్థాలు, సూక్ష్మక్రిములు శరీరంలోకి వెళ్లకుండా టాన్సిల్స్ అడ్డు క‌ట్ట వేస్తాయి.

అయితే వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల వ‌ల్ల ఒక్కోసారి టాన్సిల్స్‌ వాపుకు గుర‌వుతుంటాయి.దాంతో తీవ్ర‌మైన నొప్పి మొదలవుతుంది.

ఫ‌లితంగా తిన‌డానికి, తాగ‌డానికే కాదు మాట్లాడ‌టానికి కూడా ఇబ్బంది ప‌డాల్సి ఉంటుంది.కొంద‌రికైతే జ్వ‌రం కూడా వ‌చ్చేస్తుంది.

అయితే అలాంటి స‌మ‌యంలో ఇప్పుడు చెప్ప‌బోయే బెస్ట్ అండ్ సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే ఈజీగా టాన్సిల్స్ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.టాన్సిల్స్ వాపును త‌గ్గించ‌డంలో వేపాకు ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

ఒక గ్లాస్ వాట‌ర్‌లో స్పూన్ వేపాకు పొడి లేదా కొన్ని వేపాలు వేసి బాగా మ‌రిగించి.

ఫిల్ట‌ర్ చేసుకోవాలి.గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత చిటికెడు న‌ల్ల ఉప్పు క‌లుపుకుని సేవించాలి.

ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.అలాగే టాన్సిల్స్‌తో బాధ‌ప‌డేట‌ప్పుడు కొంద‌రు పెరుగును ఎవైడ్ చేస్తుంటారు .

కానీ, పెరుగును ఖ‌చ్చితంగా తీసుకోవాలి.అందులోనూ ఒక క‌ప్పు పెరుగులో ఒక స్పూన్ తేనె, ఒకస్పూన్ నిమ్మ‌రసం యాడ్ చేసుకుని తీసుకుంటే.

టాన్సిల్స్ స‌మ‌స్య త్వ‌ర‌గా త‌గ్గుతుంది.మ‌రియు గొంతునొప్పి, గొంతు వాపు వంటివి సైతం ప‌రార్ అవుతాయి.

"""/" / టాన్సిల్స్‌తో ఇబ్బంది ప‌డే వారు.తుల‌సి టీ, అల్లం టీ, దాల్చిన చెక్క టీ, ప‌సుపు టీ వంటివి తీసుకున్నా మంచి ఉప‌శ‌మ‌నం ఉంటుంది.

ఇక టాన్సిల్స్ వాపుకు గురైన‌ప్పుడు సిట్రస్ పండ్లు, చల్లని ఆహారాలు, నూనెలో వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

వాట‌ర్ ఎక్కువ‌గా సేవించాలి.మ‌రియు ఉప్పు వేసిన గోరు వెచ్చ‌టి నీటితో త‌ర‌చూ గార్గిల్ చేస్తూ ఉంటె టాన్సిల్స్ వాపు త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

అమెరికా : స్కూళ్లలోకి టీచర్లు హ్యాండ్‌ గన్ తీసుకెళ్లేలా .. కీలక బిల్లుకు టెన్నెస్సీ ఆమోదం