త‌ల‌లో మొటిమ‌లు వేధిస్తున్నాయా? వెల్లుల్లితో నివారించుకోండిలా!

త‌ల‌లో మొటిమ‌లు.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిలో క‌నిపించే స‌మ‌స్య ఇది.

శ‌రీరంలో అధిక వేడి, ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, ప‌లు ర‌కాల కెమిక‌ల్‌ ప్రోడెక్ట్స్ వాడ‌కం, త‌ల‌పై జిడ్డు అధికంగా ఉత్ప‌త్తి కావ‌డం, కాలుష్యం ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల మొటిమ‌లు ఏర్ప‌డి ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

ఈ క్ర‌మంలోనే త‌ల‌లోని మొటిమ‌లు నివారించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఖ‌రీదైన ఆయిల్స్ వాడుతుంటారు.

అయితే ఇంట్లోనే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటిస్తే.సులువుగా ఈ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి. """/" / త‌ల‌లోని మొటిమ‌ల‌ను నివారించ‌డంలో వెల్లుల్లి అద్భుతంగా సహాయ ప‌డుతుంది.

ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేయాలి.ఇప్పుడు ఒక బౌల్‌లో కొబ్బ‌రి నూనె, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత నూనెను ఫిల్ట‌ర్ చేసుకుని ఓ డ‌బ్బాలో స్టోర్ చేసుకోవాలి.ఈ నూనెను రోజుకు ఒక సారి త‌ల‌కు ప‌ట్టిస్తే మొటిమ‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

అలాగే జాజికాయ కూడా త‌ల‌లోని మొటిమ‌ల‌ను నివారించ‌గ‌ల‌దు.జాజికాయ‌ను మెత్త‌గా పొడి చేసి.

అందులో పావు వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న చోట అప్లై చేసి.

అర గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

ఇలా చేస్తే మొటిమ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు. """/" / మెంతాకు సైతం త‌ల‌లోని మొటిమ‌ల‌ను త‌గ్గించ‌గ‌ల‌దు.

కొన్ని మెంతాకుల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్‌లో నిమ్మ ర‌సం యాడ్ చేసి.

త‌ల‌కు ప‌ట్టించాలి.ముప్పై, న‌ల‌బై నిమిషాల అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూతో హెడ్ బాత్ చేయాలి.

ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.

బిగ్ బాస్ లోకి గుప్పెడంత మనసు హీరో రిషి వసుధార… రచ్చ మామూలుగా ఉండదుగా?