గోరుచుట్టుతో బాధ‌ప‌డుతున్నారా.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

గోరుచుట్టు.ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక టైమ్‌లో ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డే ఉంటారు.

వేలి గోరు చుట్టు వాపు ఏర్ప‌డి బాధించ‌డ‌మే గోరుచుట్టు అంటారు.ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ కార‌ణంగా గోరుచుట్టు ఏర్ప‌డుతుంది.

ఈ స‌మ‌స్య చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ.నొప్పి మాత్రం భ‌రించ‌లేనంత‌గా ఉంటుంది.

ఇక ఈ గోరుచుట్టును త‌గ్గించుకునేందుకు ఏం చేయాలో తెలియ‌క‌.నొప్పిని త‌గ్గించుకునేందుకు పెయిన్ కిల్ల‌ర్స్ వాడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్‌ను పాటిస్తే.సులభంగా గోరుచుట్టును నివారించుకోవ‌చ్చు.

గోరుచుట్టుకు చెక్ పెట్ట‌డంతో ప‌సుపు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ముందుగా పసుపు తీసుకుని.

అందులో కొద్దిగా వాట‌ర్ మిక్స్ చేసి గోరుచుట్టు అప్లై చేయాలి.ఇలా రాత్రి నిద్రించే ముందు చేయాలి.

ఇలా రెండు, మూడు సార్లు చేస్తే.క్ర‌మంగా గోరుచుట్టు త‌గ్గుముఖం ప‌డుతుంది.

అలాగే ఉల్లిపాయ కూడా గోరుచుట్టును త‌గ్గిస్తుంది.ఉల్లిపాయ మెత్త‌గా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.

ఈ ఉల్లి ర‌సాన్ని గోరుచుట్టు మెల్ల‌గా అప్లై చేసి.బ్యాండేజీ క‌ట్టాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఉల్లిపాయ‌లో ఉండే యాంటీ ఫంగ‌ల్ గుణాలు.గోరుచుట్టు కార‌ణ‌మ‌య్యే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను నాశ‌నం చేస్తుంది.

దాంతో గోరుచుట్టు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. """/" / బేకింగ్ సోడాతో కూడా గోరుచుట్టుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

బేకంగ్ సోడా వాట‌ర్ వేసి మిక్స్ చేసుకుని.గోరుచుట్టుకు అప్లై చేయాలి.

రాత్రి నిద్రించే ముందు ఇలా వేలికి రాసి.ఆ త‌ర్వాత బ్యాండేజీ వేయాలి.

దీని వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం టుంది.ఇక యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌తో కూడా గోరుచుట్టును నివారించుకోవ‌చ్చు.

యాపిల్ సిడార్ వెనిగ‌ర్ తీసుకుని.గోరుచుట్టుకు అప్లై చేయాలి.

ఇలా రోజులో రెండు లేదా మూడు సార్లు చేస్తే.అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్ ఫ్ల‌మెట‌రీ గుణాలు గోరుచుట్టును త్వ‌ర‌గా తగ్గిస్తాయి.

టైమ్స్ స్క్వేర్‌లో మెరిసిపోతున్న ఘట్టమనేని సితార