అండర్ ఆర్మ్స్ న‌లుపును వ‌దిలించే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే!

అండ‌ర్ ఆర్మ్స్ న‌లుపు చాలా మందిని ఇబ్బంది పెట్టే కామ‌న్ స‌మ‌స్య ఇది.

ముఖ్యంగా అమ్మాయిలు ఈ స‌మ‌స్య కార‌ణంగా స్లీవ్ లెస్ టాప్స్, డ్రెస్సులను ధరించాలంటే తెగ ఇబ్బంది ప‌డిపోతుంటారు.

ఈ నేప‌థ్యంలోనే అండ‌ర్ ఆర్మ్స్ న‌లుపును వ‌దిలించుకునేందుకు నానా తంటాలు ప‌డుతుంటారు.ఖ‌రీదైన క్రీములు వాడుతుంటారు.

అయిన‌ప్ప‌టికీ త‌గ్గ‌కుంటేబ్యూటీ పార్ల‌ర్‌లో ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.కానీ, ఇంట్లోనే కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే.

సుల‌భంగా ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

అండ‌ర్ ఆర్మ్స్ న‌లుపును వ‌దిలించ‌డంలో కీరదోసకాయ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ముందుగా కీర‌దోసకాయ ముక్క‌ల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.

ఇప్పుడు ఈ ర‌సంలో కొన్ని వేసి క‌రిగించి న‌లుపు ఉన్న చోటు పూసుకోవాలి.

ఇర‌వై నిమిషాల అనంత‌రం వేళ్ల‌తో బాగా రుద్దుకుంటూ చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత త‌డి లేకుండా తుడిచి మాయిశ్చ‌రైజ‌ర్ అప్లై చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే న‌లుపు పోయి అండ‌ర్ ఆర్మ్స్ తెల్ల‌గా, మృదువుగా మార‌తాయి.

"""/"/ అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ పాలు, రెండు స్పూన్ల పెస‌ర పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్న అండ‌ర్ ఆర్మ్స్‌లో అప్లై చేసి డ్రై అయిన త‌ర్వాత స్క్ర‌బ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.ఇక ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ప‌సుపు, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుని క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని న‌లుపు ఉన్న చోట అప్లై చేసి.ఇర‌వై, ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే.

అండ‌ర్ ఆర్మ్స్ తెల్ల‌గా, అందంగా మార‌తాయి.

చుండ్రుతో దిగులెందుకు.. పుదీనా ఉందిగా అండగా..!