ఆ భాగంలో నలుపును వదిలించే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ఇవే!
TeluguStop.com
తొడల భాగంలో నలుపు.చాలా మంది కామన్‌గా ఫేస్ చేసే సమస్యల్లో ఇదీ ఒకటి.
కానీ, ఎవరూ బయటకు చెప్పుకోలేరు.మరోవైపు ఈ సమస్యను ఎలా నివారించుకోవాలో అర్థం గాక లోలోనే తెగ సతమతమైపోతుంటారు.
ఈ క్రమంలోనే మార్కెట్‌లో లభ్యమయ్యే రకరకాల క్రీములను వాడుతుంటారు.కానీ, ఇంట్లోనే కొన్ని సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీస్‌ను ఫాలో అయితే చాలా సులభంగా తొడల భాగంలో ఏర్పడిన నలుపును వదిలించుకోవచ్చు.
మరి లేటెందుకు ఈ హోమ్ రెమెడీస్ ఏంటో ఓ లుక్కేసేయండి. """/" /
ముందుగా కొన్ని కీరా ముక్కలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి.
ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల ఎర్ర కంది పప్పు పిండి, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి స్మూత్‌గా స్క్రబ్ చేసుకోవాలి.
స్క్రబ్ అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు ఒక సారి చేస్తే కేవలం కొన్ని రోజుల్లోనే నలుపు పోతుంది.
అలాగే బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ములేథి పౌడర్, అర స్పూన్ పసుపు, రెండు స్పూన్ల తేనె, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆ భాగంలో పూసి కాస్త డ్రై అవ్వనివ్వాలి.అప్పుడు మెల్ల మెల్లగా రుద్దుకుంటూ కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేసినా నలుగు తగ్గి.ఆ ప్రాంతంలోని చర్మం తెల్లగా, మృదువుగా మారుతుంది.
"""/" /
ఇక ఈ రెమెడీస్‌తో పాటుగా నిత్యం తొడల భాగంలో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి.
మరియు కొందరు చాలా టైట్‌గా ఉండే దుస్తులను ధరిస్తారు.దాంతో గాలి ఆడక తొడల భాగంలో చర్మం నల్లగా మారుతుంది.
అందుకే కాస్త వదలుగా ఉండే దుస్తులను వేసుకోవాలి.
సిక్కు ఎన్జీవో సంస్ధ పెద్ద మనసు .. అమెరికా వ్యాప్తంగా ఏకంగా 10 వేల మందికి భోజనం