ఎండ‌ల‌కు ముఖం న‌ల్ల‌గా మారుతుందా..బాదంతో ఇలా చేస్తే స‌రి!

ఏప్రిల్ నెల వ‌చ్చిందో లేదో.భానుడు భ‌గ భ‌గ మంటూ ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు.

వేస‌వి తాపాన్ని త‌ట్టుకోలేక‌ ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.ఇక ఈ ఎండ‌ల కార‌ణంగా ఆరోగ్య‌మే కాద చ‌ర్మం కూడా దెబ్బ తింటుంది.

ముఖ్యంగా ఈ వేస‌వి కాలంలో కొంత స‌మ‌యం బ‌య‌ట తిరిగినా ముఖం న‌ల్ల‌గా, కాంతిహీనంగా మారిపోతుంటుంది.

దాంతో ముఖాన్ని మ‌ళ్లీ ఎలా తెల్ల‌గా మార్చుకోవాలో తెలియ‌క నానా పాట్లు ప‌డుతుంటారు.

అయితే ఇంట్లోనే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే ముఖాన్ని మ‌ళ్లీ మామూలు స్థితికి తీసుకురావ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.,/br ఎండ‌ల వ‌ల్ల న‌ల్ల‌బ‌డిన ముఖానికి మ‌ళ్లీ తెల్ల‌గా మార్చ‌డంలో బాదం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

కొన్ని బాదం ప‌ప్పుల‌ను తీసుకుని తొక్క తీసేసి మెత్త‌గా పౌడ‌ర్ చేసుకోవాలి.ఇప్పుడు ఆ పౌడ‌ర్‌లో కొద్దిగా తేనె మ‌రియు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే ముఖం తెల్ల‌గా మారుతుంది.

"""/"/ అలాగే ఒక బౌల్‌లో బియ్యం పిండి, క‌ల‌బంద గుజ్జు, పెరుగు మ‌రియు రోజ్ వాట‌ర్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.

బాగా ఆరిన త‌ర్వాత కొద్దిగా నీళ్లు జ‌ల్లి వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తూ ఉండాలి.ఇలా చేసినా ఎండ దెబ్బ‌కు న‌ల్ల‌గా మారిన ముఖం తెల్లగా మారుతుంది.

ఇక ఒక బౌల్ తీసుకుని అందులో కీర దోస‌కాయ పేస్ట్, పుదీనా పేస్ట్ మ‌రియు నిమ్మ ర‌సం వేసి క‌లిపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మానికి ముఖానికి ప‌ట్టించి పావు గంట త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఓటీటీ రైట్స్‌తో కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే.. ఈ సినిమాలదే అద్భుతమైన రికార్డ్!