ముఖం ఎల్లప్పుడు తేమగా ఉండాలా..అయితే ఈ టిప్స్ మీకే?
TeluguStop.com
సాధారణంగా కొందరి ముఖం సీజన్‌తో పని లేకుండా ఎప్పుడూ పొడి బారిపోయి డ్రైగా కనిపిస్తుంటుంది.
దాంతో ముఖాన్ని తేమగా మార్చుకునేందుకు రకరకాల మాయిశ్చరైజర్లు, క్రీములు, లోషన్లు ఇలా ఎన్నో వాడుతుంటారు.
కానీ, ఇవి కొంత సమయం పాటే పని చేస్తాయి.ఫలితంగా, కొన్ని గంటలకే ముఖం మళ్లీ డ్రైగా మారిపోతుంది.
కానీ, కొన్ని న్యాచురల్ టిప్స్ ఫాలో అయితే.ముఖం ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవచ్చని అంటున్నారు నిపుణులు.
మరి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.చర్మానికి తేమను అందించడంలో టమాటా అద్భుతంగా సహాయపడుతుంది.
బాగా పండిన టమాటాను మెత్తగా పేస్ట్ చేసుకుని.అందులో కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముఖం తేమగా, కాంతివంతంగా ఉంటుంది.
"""/"/
అలాగే ఒక బౌల్‌లో నువ్వుల నూనె మరియు కొద్దిగా నిమ్మ రసం వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.చర్మంలోకి బాగా ఇంకిపోయేలా మర్దనా చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే.ముఖం తేమగా ఉంటుంది.
చాలా మంది వేడి వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తుంటారు.కానీ, ఇలా చేయడం వల్ల చర్మంలోని తేమ, సహజ నూనెలు పోతాయి.
దాంతో చర్మం డ్రైగా మారుతుంది.అందుకే గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి.
ఆ నీటిలో రెండు, మూడు చుక్కలు కొబ్బరి నూనె వేసుకుని స్నానం చేస్తే ఇంకా మంచిది.
ఇక డైలీ డైట్‌లో నట్స్, తాజా పండ్లు, పప్పు ధాన్యాలు, పాలు ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి.
సోడాలు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.లేదంటే చర్మం మరింత డ్రైగా మారిపోతుంది.
చిరంజీవి విశ్వంభర సినిమాతో పాన్ ఇండియాలో సక్సెస్ కొడుతాడా..?