పాదాల దుర‌ద‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకే

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో వ‌ర్ష‌పు నీటిలో పాదాలు త‌డ‌వ‌టం వ‌ల్ల‌.

బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ సోకి దుర‌ద పెడుతూ ఉంటాయి.నీటితో ఎంత క‌డిగినా దురద పోనే పోదు.

దాంతో చిరాకు, బాధ పీక్స్‌లోకి చేరిపోతాయి.మ‌రోవైపు పాదాల దుర‌ద‌ను ఎలా నివారించుకోవాలో అర్థంగాక‌ తెగ మ‌ద‌న ప‌డి పోతూ ఉంటారు.

అయితే అలాంటి స‌మ‌యంలో కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే.సుల‌భంగా పాదాల దుర‌ద‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి. """/" / వివిధ రకాల ఇన్ఫెక్షన్స్‌, బ్యాక్టీరియాల‌తో పోరాడ‌టంలో పెరుగు, ప‌సుపు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అందువ‌ల్ల‌, ఒక బౌల్ తీసుకుని.నాలుగు స్పూన్ల పెరుగు, అర స్పూన్ల ప‌సుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు పూసి.ప‌ది నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో పాదాల‌ను శుభ్రం చేసుకోవాలి.ఇలా చేస్తే క్ష‌ణాల్లోనే దుర‌ద త‌గ్గుతుంది.

అలాగే సాల్ట్ స్క్ర‌బ్‌తో కూడా పాదాల దుర‌ద‌ను నివారించుకోవ‌చ్చు.ఒక బౌల్ తీసుకుని అందుల్లో మూడు స్పూన్ల సాల్ట్‌, ఒక స్పూన్ నిమ్మ ర‌సం వేసి క‌లిపి.

ఈ మిశ్ర‌మంతో పాదాల‌ను నాలుగైదు నిమిషాల పాటు బాగా స్క్ర‌బ్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది. """/" / ఇక కొన్ని వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌ను అప్లై చేసి.

పావు గంట పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా పాదాల దుర‌ద నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

రోజూ 20 నిమిషాలే పనిచేస్తాడు.. ఏటా రూ.3.8 కోట్లు సంపాదిస్తాడు..?