సూర్య కిరణాల కారణంగా వచ్చే మచ్చలను తగ్గించుకోవటానికి టిప్స్

సూర్యుని నుండి వెలుబడే అతినీలలోహిత కిరణాల కారణంగా ముఖంపై మరియు శరీరంపై మచ్చలు వస్తూ ఉంటాయి.

ఈ మచ్చలు వచ్చినప్పుడు  కంగారు పడవలసిన అవసరం లేదు.అలాగే ఖరీదైన కాస్మొటిక్స్ కొనవలసిన అవసరం లేదు.

మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అలోవెరాలో ఉన్న అద్భుతమైన లక్షణాలు చర్మాన్ని కాంతి వంతంగా మార్చటమే కాకుండా ముఖంపై ఏర్పడిన మచ్చలను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

అలోవెరా జెల్ ని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిముషాలు మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ సిడర్ వెనిగర్ లో ఆల్ఫా హైడ్రోక్సీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండుట వలన మచ్చలను తగ్గించటంలో సహాయపడుతుంది.

ఒక కాటన్ బాల్ సాయంతో ఆపిల్ సిడర్ వెనిగర్ ని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.

ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. """/" / గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన సూర్యుని కారణంగా వచ్చే మచ్చలు తొలగి పోతాయి.

గ్రీన్ టీలో కాటన్ బాల్ ని ముంచి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఈ విధంగా వారంలో మూడు నుంచి నాలుగు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

పెళ్లి తర్వాత టాలివుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన కియారా.. కారణం ఏంటి?