ముఖంపై పిగ్మెంటేష‌న్‌..ఈ చిట్కాల‌తో చెక్ పెట్టేయండి!

పిగ్మెంటేష‌న్‌.చాలా మందిని కామ‌న్‌గా వేధించే స‌మ‌స్య ఇది.

చ‌ర్మంపై న‌ల్ల మ‌చ్చ‌ల‌ను ఉండ‌డాన్నే పిగ్మెంటేష‌న్ అంటారు.ముఖంపై ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది.

హార్మోన్‌ మార్పులు, వ‌య‌సు పైబ‌డ‌టం, ఎండ, థైరాయిడ్‌ సమస్యలు, కొన్ని రకాల టాబ్లెట్లు వాడ‌కం, ఆహార‌పు అల‌వాట్లు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పిగ్నెంటేష‌న్ స‌మ‌స్యను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

ఎంత తెల్ల‌గా ఉన్నా.పిగ్మెంటేష‌న్ ఏర్ప‌డితే అంద‌హీనంగా క‌నిపిస్తారు.

దీంతో పిగ్మెంటేష‌న్ స‌మ‌స్యను ఎలా త‌గ్గించుకోవాలా అని హైరానా ప‌డుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాలు పాటిస్తే సింపుల్‌గా పిగ్నెంటేష‌న్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

పిగ్మెంటేష‌న్ స‌మ‌స్య‌ను నివారించ‌డంలో ఎర్ర ఉల్లి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఎర్ర ఉల్ల‌పాయను పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.

ఆ ర‌సంలో కొద్దిగా తేనె క‌లిపి పిగ్మెంటేష‌న్ ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి.

ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నిచ్చి.ఆ త‌ర్వాగ చ‌ల్ల‌టి వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెగ్యుల‌ర్‌గా చేస్తే.క్ర‌మంగా స‌మ‌స్య దూరం అవుతుంది.

"""/" / అలాగే వెనిగర్ కూడా పిగ్మెంటేష‌న్ ను త‌గ్గించ‌డంలో గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

కొద్దిగా వెనిగ‌ర్ తీసుకుని నీటిలో వేసి బాగా క‌ల‌పుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌భావిత ప్రాంతంలో అప్లై చేసి.

రెండు నిమిషాల పాటు మ‌సాజ్ చేయాలి.ఆరిన త‌ర్వాత కోల్డ్ వాట‌ర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేసినా పిగ్మెంటేష‌న్ స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.ఇక కందిప‌ప్పుతో కూడా పిగ్మెంటేష‌న్ స‌మ‌స్య‌ను దూరం చేసుకోవాలి.

కొద్దిగా కందిప‌ప్పు తీసుకుని నీటిలో వేసి బాగా నాన‌బెట్టాలి.ఆ త‌ర్వాత నాన‌బెట్టుకున్న కందిప‌ప్పును పేస్ట్ చేసి.

అందులో ప‌చ్చి ప‌లు మ‌రియు నిమ్మ‌ర‌సం క‌లిపి పిగ్మెంటేష‌న్ ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి.

పావు గంట త‌ర్వాత వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Chandra Babu : వైసీపీని ఓడించి ఏపీని కాపాడుకోవాలి..: చంద్రబాబు