ర‌ఫ్‌ హెయిర్‌తో ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

సాధార‌ణంగా కొంద‌రు జుట్టు ర‌ఫ్‌గా.బ‌ర‌క‌గా పొడిబారిన‌ట్టు ఉంటుంది.

సిల్క్ అండ్ స్మూత్ హెయిర్‌ను ఇష్ట‌ప‌డే వారు ర‌ఫ్ హెయిర్‌ను అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు.

ఈ క్ర‌మంలోనే ర‌ఫ్ హెయిర్‌ను సిల్కీగా మార్చుకునేందుకు కొంద‌రు పార్ల‌ర్స్ చుట్టూ తిరిగితే.

మ‌రికొంద‌రు మార్కెట్‌లో దొరికే హెయిర్ ఫ్యాక్స్ మ‌రియు షాంపూలు వాడుతూ ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటారు.

అయిన‌ప్ప‌టికీ ఎలాంటి మార్పు లేకుంటే.తెగ మ‌ధ‌న‌ప‌డిపోతూ ఉంటారు.

అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఫాలో అయితే.ర‌ఫ్ హెయిర్‌ను సులువుగా సిల్క్, స్మూత్ మ‌రియు హెల్తీ హెయిర్‌గా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి. """/" / ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా పెరుగు మ‌రియు క‌ల‌బంద గుజ్జు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు మ‌రియు కేశాల‌ను ప‌ట్టి.అర‌గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ర‌ఫ్ హెయిర్ కాస్త క్ర‌మంగా సిల్కీగా మ‌రియు స్మూత్‌గా మారుతుంది.

"""/" / రెండొవ‌ది.ఒక‌ అవోకాడో తీసుకుని పై తొక్క‌ను తీసేసి లోప‌లి భాగాన్ని బాగా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొద్దిగా బాదం ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు మ‌రియు కేశాల‌ను ప‌ట్టి.గంట పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారినికి రెండు లేదా మూడు సార్లు చేస్తే జుట్టు సిల్కీగా మార‌డంతో పాటు బ‌లంగా, ఒత్తుగా ఎదుగుతుంది.

"""/" / మూడొవ‌ది.ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్ వైట్ మ‌రియు ఆలివ్ ఆయిల్ రెండిటిని మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు బాగా అప్లై చేసి.అర గంట నంచి గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల కేశాలు సిల్కీగా మార‌తాయి.

Anasuya : ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న రంగమ్మత్త..  అలాగే ఉంటానంటూ పోస్ట్?