రొజేషియా వ్యాధిని తగ్గించుకోవటానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు
TeluguStop.com
ప్రతి మహిళ ముఖం అందంగా,ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటుంది.అంతేకాక ముఖం అందంగా కనపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం.
దాని కోసం ఎంత ఖర్చు పెట్టడానికి అయినా సిద్ధం అవుతాం.అయితే కొన్ని చర్మ సమస్యలు మాత్రం ఒక పట్టాన తగ్గవు.
వాటిలో రొజేషియా వ్యాధి ఒకటి.ఈ వ్యాధి కారణంగా చర్మం చెంపలు దురద, వాపు, ఎరుపెక్కడం జరుగుతూ ఉంటుంది.
ఈ వ్యాధిని కొన్ని అద్భుతమైన చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
అరస్పూన్ బాదం నూనెలో నాలుగు చుక్కల లావెండర్ నూనెను కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి సున్నితంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేసి బాగా ఆరిన తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
అరస్పూన్ ఆలివ్ నూనెలో మూడు చుక్కల అవిసె నూనెను వేసి బాగా కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి సున్నితంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 10నిమిషాల తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
"""/" /
చామోమైల్ టీ అనేది రొజేషియా వ్యాధిని తగ్గించటానికి చాలా సమర్ధవంతంగాపనిచేస్తుంది.
పంచదార వేయని చామోమైల్ టీలో కాటన్ బాల్ ని ముంచి ప్రభావిత ప్రాంతంపై రాసి సున్నితంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితోశుభ్రం చేయాలి.
ఒక స్పూన్ ఉడికించిన ఓట్ మీల్ లో అరస్పూన్ రోజ్ వాటర్ కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి.
ఇలా వారానికిరెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.
ప్రభాస్ మూవీకి కథ అందిస్తున్న స్టార్ హీరో.. ఆ సినిమా సంచలన రికార్డులు పక్కా!