గొంతులో కఫం ఇర్రిటేట్ చేస్తుందా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
TeluguStop.com
గొంతులో కఫం ఉంటే ఎంత ఇర్రిటేటింగ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కఫం ఉంటే గొంతు తరచూ గరగర మంటూ అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
శ్వాస పీల్చడం కాస్త ఇబ్బందిగా మారుతుంది.అలాగే గొంతులో కఫం ఉంటే.
వికారంగానూ, చికాకుగానూ అనిపిస్తుంది.ఇక ఈ కఫాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం చివరకు తీవ్ర దగ్గుకు దారి తీస్తుంది.
అందుకే ఈ కఫానికి ఆరంభంలోనే చెక్ పెట్టాలంటున్నారు నిపుణులు.అయితే చాలా మంది ఈ కఫాన్ని ఎలా నివారించుకోవాలో తెలియదు.
అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే.చాలా సులువుగా కఫాన్ని తొలిగించుకోవచ్చు.
మరి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.ఉల్లిపాయ కఫాన్ని నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
ఉల్లిపాయ తీసుకుని శుభ్రంగా కట్ చేసుకుని.చూర్ణం చేసుకోవాలి.
ఆ ఉల్లి చూర్ణంలో కొద్దిగా తేనె మిక్స్ చేసుకోవాలి.ఉదయం, సాయంత్రం ఒక స్పూన్ చప్పున తీసుకోవాలి.
ఇలా రెగ్యులర్ చేస్తే.కఫం తగ్గుముఖం పడుతుంది.
"""/" /
దాల్చినచెక్క, అలం కాంబినేషన్ కూడా కఫానికి చెక్ పెట్టగలవు.అందువుల్ల, టీలో కొద్దిగా అల్లం పేస్ట్ మరియు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మరిగించి.
గోరు వెచ్చగా ఉన్నప్పుడు సేవించాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే.
కఫం నుంచి ఉపశమనం కలుగుతుంది.ఇక పైనాపిల్ కూడా కఫాన్ని తగ్గించగలదు.
పైనాపిల్ ముక్కలను పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.ఆ రసం రోజుకు ఒక సారి తీసుకుంటే.
కఫం తగ్గిపోతుంది.అలాగే కఫం ఎక్కువగా ఉన్నప్పుడు.
నల్ల మిరియాలతో తయారు చేసిన కషాయాన్ని తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది.ఇక కఫం సమస్య ఉన్న వారు జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, డైరీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
అదే సమయందో స్మోకింగ్ అలవాటు ఉంటే మానుకోవాలి.లేదంటే కఫం మరింత ఎక్కువ అవుతుంది.
వీడియో: నెటిజన్లను నవ్విస్తున్న ఎలాన్ మస్క్ రోబో.. తడబడుతూనే నడక నేర్చుకుంటోందిగా..?