స‌న్ ట్యాన్‌తో చ‌ర్మం క‌మిలిపోతుందా.. అయితే ఇలా చేయండి!

స‌మ్మ‌ర్ సీజ‌న్ వ‌చ్చేసింది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యం విష‌యంలోనే కాదు.

చ‌ర్మాన్ని కూడా జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా స‌మ్మ‌ర్‌లో స‌న్ ట్యాన్ స‌మ‌స్య ఎక్కువ‌గా ఇబ్బంది పె‌డుతుంది.

ఎండ‌ల్లో ఎక్కువ‌గా తిరిగిన‌ప్పుడు.చ‌ర్మం పై పొర దెబ్బ తింటుంది.

దాంతో ట్యానింగ్‌కు గురై.చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతుంది.

అయితే ఒక్కోసారి స‌న్ ట్యాన్ వ‌ల్ల చ‌ర్మం ఎర్ర‌గా క‌మిలిపోతుంటుంది కూడా.ఇలా క‌మిలిపోయిన చ‌ర్మాన్ని మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి రావాలంటే.

కొన్ని టిప్స్‌ను ఖ‌చ్చితంగా పాటించాలి.ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండ వ‌ల్ల క‌మిలిపోయిన చ‌ర్మాన్ని నివారించ‌డంలో బొప్పాయి అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.బాగా పండిన బొప్పాయి పండు నుంచి గుజ్జు తీసుకుని.

అందులో కొద్దిగా నిమ్మ ర‌సం క‌లిపి కమిలిన పాత్రంలో అప్లై చేయాలి.ఆ త‌ర్వాత వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా రుద్ది.

పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే క్ర‌మంగా క‌మిలిపోయిన చ‌ర్మం మామూలు స్థితికి చేరుకోవ‌డంతో పాటు కాంతివంతంగా కూడా మారుతుంది.

"""/" / అలాగే ఒక బౌల్‌లో ఓట్స్ పొడి, ఆలివ్ ఆయిల్ మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని కమిలిన పాత్రంలో పూత‌లా వేసి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో చ‌ర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

"""/" / ఇక పైనాపిల్ ముక్క‌ల‌ను పేస్ట్ చేసుకుని.అందులో కొద్దిగా పాల పొడి మ‌రియు పెరుగు వేసి బాగా క‌లుపుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని చర్మం కమిలిన ప్రదేశంలో అప్లై చేసి.పొడిగా అయిన‌ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేస్తే క‌మిలిన చ‌ర్మం.మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది.

మ‌రియు మృదువుగా కూడా మారుతుంది.

బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మకు అలాంటి మెసేజ్ లు.. అతని అమ్మను ఇలా అంటే పరవాలేదా అంటూ?