వేస‌విలో చిరాకు పెట్టే చెమ‌ట‌ల‌కు ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి?

వేస‌వి కాలం స్టార్ట్ అయిపోయింది.ఎండ‌లు మెల్ల మెల్ల‌గా ముదిరిపోతున్నాయి.

ఉద‌యం నుంచి భానుడు భ‌గ భ‌గ మంటున్నాడు.అయితే ఈ వేస‌వి కాలంలో ప్రాధానంగా వేధించే స‌మ‌స్య‌ అధిక చెమ‌ట‌లు.

ముఖ్యంగా అర‌చేతులు, ముఖం, అండ‌ర్ ఆర్మ్స్‌, కాళ్ల‌లో ఎక్కువ‌గా చెమ‌ట‌లు ప‌డుతుంటాయి.ఇలా చెమ‌ట‌లు కారుతంటే.

బ‌ట్ట‌లు త‌డిచిపోవ‌డ‌మే కాదు చిరాకు త‌రా స్థాయికి చేరుకుంటుంది.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.

సుల‌భంగా ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.స్వ‌చ్ఛ‌మైన గంధం పొడి.

అధిక చెమ‌ట‌ల‌ను నివారించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.గంధం తీసుకుని కొద్దిగా వాట‌ర్ మిక్స్ చేసి.

ముఖానికి, అర చేతుల‌కు, అండ‌ర్ ఆర్మ్స్ లో మ‌రియు కాళ్ల‌కు అప్లై చేసి.

ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం కోల్డ్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకుంటే.

చెమ‌ట‌లు ప‌ట్ట‌డం త‌గ్గి.శ‌రీరం చ‌ల్ల ప‌డుతుంది.

అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ ను స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో చర్మానికి అప్లై చేయ‌డం వ‌ల్ల కూడా అధికంగా చెమ‌ట‌లు ప‌ట్ట‌డం త‌గ్గుతాయి.

బ్లా టీ బ్యాగ్‌ను ఫ్రీజ‌ర్‌లో పెట్టి.ఆరేడు గంట‌ల త‌ర్వాత బ‌య‌ట‌కు తీయాలి.

ఈ టీ బ్యాగ్‌ను బాగా చెమ‌ట‌లు ప‌ట్టే ప్రాంతాల్లో అప్లై చేయాలి.పావు గంట త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే చర్మ రంద్రాలు శుభ్రపడుతాయి.చెమ‌ట‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

"""/"/ ఇక ఈ టిప్స్‌తో పాటు వేస‌వి కాలంలో వేడివేడి ఆహార పదార్థాలను, మ‌సాలా వంట‌లకు, అధిక కేల‌రీలు ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించేయాలి.

ఉల్లిపాయ, బీఫ్, లివర్, అల్లం, వెల్లులి, జీల‌క‌ర్ర‌, బ్రకోలి వంటి ఆహారాలును కూడా ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో త‌క్కువ‌గా తీసుకోవాలి.

ఎందుకంటే, వీటి వ‌ల్ల చెమ‌ట‌లు మ‌రింత పెరుగుతాయి.

ఈ సంగతి తెలిస్తే, మీరు ఇక పానీపూరి బండివంక కన్నెత్తి కూడా చూడరు!