ఈ పద్దతులు పాటించండి రక్తహీనతకు చెక్ పెట్టండి.

మారిన జీవన పరిస్థితులు,ఆహరపు అలవాట్లతో మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడుచేసుకుంటున్నాము.ఆరోగ్యం పట్ల కొంచెం కన్సర్న్ కలిగి ఉండి అనారోగ్యం మన దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవచ్చు .

కాని నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే వారే కరువయ్యారు.

దాంతో రక్తహీనత భారిన పడుతూ మరిన్ని ఆరోగ్యసమస్యలు కొనితెచ్చుకుంటున్నారు.పులుపు, ఉప్పు అధికంగా తీసుకోవడం, పోషకాహార లోపం, మధ్యాహ్నం నిద్ర లేదా అతి నిద్ర, అజీర్ణం, మలబద్దకం, స్త్రీలకు రుతు సమస్యలు, థైరాయిడ్ వంటి అనేక కారణాల వల్ల రక్తహీనత సమస్య వస్తున్నది.

ఎలాంటి మెడిసిన్ వాడకుండా కేవలం ఇంటిచిట్కాలు పాటించి ఈ సమస్యను అధిగమించండి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ · ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు లేదా పాలలో 15 గ్రాముల వంట ఆముదాన్ని కలిపి రాత్రి నిద్ర పోవడానికి ముందు సేవించాలి.

ఇలా వారంలో ఒక్కసారి మాత్రమే చేయాలి.దీనివల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

· సైంధవ లవణం 1/8 టీస్పూన్, 2 టీస్పూన్ల తేనె, 30 ఎంఎల్ నిమ్మరసం తీసుకుని అన్నింటినీ బాగా కలిపి తాగాలి.

రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే రక్తం బాగా వృద్ధి చెందుతుంది.

· ఒక కప్పు బీట్‌రూట్ రసం, అంతే మోతాదులో యాపిల్ పండు రసం తీసుకుని రెండింటినీ కలిపి తాగాలి.

రోజూ ఈ రసం తీసుకుంటే కొద్ది రోజుల్లోనే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ · బాగా పండిన అరటిపండును రెండు టీస్పూన్ల తేనెతో కలిపి తినాలి.

రోజుకు ఇలా రెండు సార్లు చేస్తే రక్తహీనత సమస్య పోతుంది.· టమాటా, యాపిల్ పండ్ల రసాలను కలిపి రోజూ సేవించినా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

· నిత్యం ఆహారంలో ఏదో ఒక విధంగా తేనెను తీసుకోవాలి.

ఇందులో ఉండే ఐరన్ శరీరంలో రక్తాన్ని తయారు చేస్తుంది.· చేపలు, ఇతర సీ ఫుడ్స్, లివర్, గుడ్డులోని పచ్చని పదార్థం, పచ్చి బఠానీలు, బ్రొకోలి, కిస్మిస్, ఖర్జూరం తదితర పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్నా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి