చెమ‌ట‌ వ‌ల్ల త‌ల దుర‌ద పెడుతోందా? అయితే ఇలా చేయండి!

వేస‌వి కాలం ప్రారంభం అయింది.ఎండ‌లు భారీగా పెరిగిపోయాయి.

ఇక వేస‌వి వ‌చ్చిందంటే.విప‌రీతంగా చెమ‌ట‌లు ప‌డుతుంటాయి.

చెమ‌ట‌లు ప‌ట్టడం ఆరోగ్యానికి మంచిదే.ఎందుకంటే, ఒంట్లో ఉండే మలినాల‌న్నీ చెమ‌ట రూపంలో బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

అయితే అధికంగా చెమ‌ట‌లు ప‌ట్ట‌డం వ‌ల్ల తీవ్ర‌మైన చిరాకును క‌ల‌గ‌జేస్తోంది.ముఖ్యంగా కొంద‌రికి శ‌రీరం నుండే కాదు త‌లలో సైతం చెమ‌ట‌లు ప‌డుతుంటాయి.

ఆ చెమ‌ట‌లు ఒక్కోసారి తీవ్ర‌మైన దుర‌ద‌కు దారి తీస్తాయి.దాంతో చెమ‌ట వ‌ల్ల త‌ల‌లో వ‌చ్చే దుర‌ద‌ను పోగొట్టుకోవ‌డం కోసం ఏం చేయాలో తెలియ‌క మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను పాటిస్తే చాలా అంటే చాలా సుల‌భంగా ఆ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ టిప్స్ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ బాదం ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, నాలుగు చుక్క‌లు టీ ట్రీ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.గంట అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

ఇలా చేస్తే దుర‌ద నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది./br """/"/ అలాగే చెమ‌ట‌ వ‌ల్ల త‌ల‌లో వ‌చ్చే దుర‌దను పిప్పరమింట్ ఆయిల్‌తోనూ నివారించుకోవ‌చ్చు.

ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ పిప్ప‌ర‌మింట్ ఆయిల్ వేసి బాగా క‌లుపుకోవాలి.

ఆపై ఈ ఆయిల్‌ను త‌ల‌కు ప‌ట్టించి రెండు గంట‌ల పాటు వ‌దిలేయాలి.అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి హెడ్ బాత్ చేస్తే దుర‌ద స‌మస్యే ఉండ‌దు.

పైగా ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా కూడా పెరుగుతుంది.

పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం ఖరీదు.. ఓ వ్యక్తి ఉద్యోగం.!