ఫంక్ష‌న్స్‌కు వెళ్లే ముందు ముఖం గ్లోగా మారాలా.. ఇలా చేస్తే స‌రి?

సాధార‌ణంగా ఏదైనా ఫంక్ష‌న్ వ‌చ్చిందంటే.అక్క‌డ అందంగా, కాంతివంతంగా క‌నిపించాల‌ని కోరుకోని వారు ఉండ‌రు.

ముఖ్యంగా అమ్మాయి అయితే అంద‌రి కంటే తామే అందంగా క‌నిపించాల‌ని కోరుకుంటారు.అయితే ఒక్కోసారి స‌డెన్‌గా ఏదో ఒక‌ పంక్ష‌న్ వ‌స్తుంది.

అలాంట‌ప్పుడు ముఖంలో గ్లో లేకుంటే ఎంత మేక‌ప్ వేసుకున్నా అందంగా క‌నిపించ‌లేరు.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ ఇంటి చిట్కాల‌ను పాటిస్తే.

క్ష‌ణాల్లోనే ముఖం గ్లోగా మారుతుంది.మ‌రి ఈ చిట్కాలు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖాన్ని గ్లోగా మార్చ‌డంలో శెన‌గ‌పిండి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి.

ఒక బౌల్‌లో ఒక స్పూన్ శెన‌గ‌పిండి మ‌రియు పుదీనా ర‌సం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.ఇర‌వై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా ఏదైనా ఫంక్ష‌న్‌కు వెళ్లే ముందు చేసుకుంటే.ముఖంలో సూప‌ర్ గ్లో వ‌స్తుంది.

"""/" / అలాగే బంగాళ‌దుంప కూడా క్ష‌ణాల్లోనే ముఖంలో గ్లోను పెంచ‌గ‌ల‌దు.ఒక బౌల్‌లో బంగాళ‌దుంప జ్యూస్ తీసుకుని.

అందులో కొద్దిగా నిమ్మ ర‌సం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూత‌లా వేసుకుని.

పావు గంట త‌ర్వాత కోల్డ్ వాట‌ర్‌తో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలతం ఉంటుంది.

"""/" / ఒక బౌల్‌లో గోధుమ పిండి మ‌రియు క్యారెట్ వేసి బాగా మిక్స్ చేసుకుని.

ముఖానికి మెడ‌కు ప‌ట్టించాలి.బాగా ఆరిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

ఏదైనా ఫంక్ష‌న్‌కు వెళ్లే ముందు ఇలా చేసినా.ముఖంలో మంచి గ్లో వ‌స్తుంది.

అంతేకాదు, ఈ ప్యాక్ వ‌ల్ల చ‌ర్మం స్మూత్ మ‌రియు అందంగా కూడా మారుతుంది.

ఇక ఎప్పుడైనా స‌డెన్ ఫంక్ష‌న్ ఎదురైన‌ప్పుడు కంగారు ప‌డ‌కుండా పై చిట్కాలు ఫాలో అయితే అందంగా క‌నిపించ‌వ‌చ్చు.

హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్న ఈజీగా ఈ ఆయిల్ తో చెక్ పెట్టొచ్చు.. తెలుసా?